ఎల్లుండే ఐసీసీ వరల్డ్ కప్ షెడ్యూల్ రాబోతోందోచ్..: డిఫరెంట్ ఫార్మట్ లో సెమీస్ జట్ల ఎంపిక

ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తోన్న ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ అధికారిక షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఐసీసీ, క్రికెట్ దక్షిణాఫ్రికా సంయుక్తంగా అక్టోబర్ 1వ తేదీ గురువారం కేప్‌టౌన్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో ఈ షెడ్యూల్‌ను లాంఛనంగా విడుదల చేయనున్నాయి. ఈ మెగా టోర్నమెంట్ వచ్చే ఏడాది అక్టోబర్ 2న ప్రారంభమౌతుంది. నవంబర్ 21న ముగియనుంది. దీనికి సరిగ్గా ఏడాది ముందు ఈ షెడ్యూల్‌ను ప్రకటిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ వరల్డ్ కప్ ను దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా నిర్వహించబోతోన్నాయి. షెడ్యూల్ విడుదలతో పాటు లీగ్ మ్యాచ్‌ల టికెట్ల విక్రయ ప్రక్రియ కూడా ఆ రోజు నుంచే మొదలుకానుంది. మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడాలనుకునే అభిమానుల కోసం ఐసీసీ టికెట్ బ్యాలెట్ రిజిస్ట్రేషన్‌ను అక్టోబర్ 1 నుంచే అందుబాటులోకి తీసుకురానుంది. మ్యాచ్ టికెట్లు తక్షణ కొనుగోలుకు వీలు ఉండదు గానీ.. ప్రాధాన్యత కోసం ముందుగానే రిజిస్టర్ చేసుకోవచ్చు.

ICC and Cricket South Africa Reveal 2027 Cricket World Cup Schedule in Cape Town October 1 Tickets

ఈ టోర్నమెంట్‌లో మొత్తం 14 జట్లు తలపడనున్నాయి. సెప్టెంబర్ 30వ తేదీ నాటికి అందుబాటులో ఉన్న ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా టోర్నీకి నేరుగా అర్హత సాధించే ప్రధాన జట్లను అధికారికంగా ఖరారు చేస్తారు. ఆతిథ్య దేశాల హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేలు నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన ఎనిమిది జట్లు వాటి ర్యాంకింగ్స్ ఆధారంగా రంగంలోకి దిగుతాయి. మిగిలిన నాలుగు స్థానాల భర్తీ కోసం వచ్చే ఏడాది ప్రత్యేకంగా క్వాలిఫైయర్ టోర్నమెంట్ జరగనుంది.

పసిడి ధరల్లో మరో భారీ పతనం: ఇక ఆగకపోవచ్చు.. !!
పసిడి ధరల్లో మరో భారీ పతనం: ఇక ఆగకపోవచ్చు.. !!

ప్రస్తుత ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ప్రకారం భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే రేసులో ముందంజలో ఉన్నాయి. ఆతిథ్య దేశం దక్షిణాఫ్రికా మూడో ర్యాంక్, బంగ్లాదేశ్‌ తొమ్మిదో స్థానంలో ఉన్నందున వాటికి నేరుగా ఐసీసీ వరల్డ్ కప్ ఆడే అవకాశం లభిస్తుంది. మరో సహ ఆతిథ్య దేశం నమీబియాకు ఇంకా అర్హత లభించలేదు. అటు వెస్టిండీస్ సైతం క్వాలిఫయర్ మ్యాచ్‌ల ద్వారానే అర్హత సాధించాల్సి ఉంటుంది.

టెంబా బావుమా, డేవిడ్ మిల్లర్ మేజిక్: ఆస్ట్రేలియాపై సెంచరీలు బాదిన హీరోలు: భారీ స్కోర్
టెంబా బావుమా, డేవిడ్ మిల్లర్ మేజిక్: ఆస్ట్రేలియాపై సెంచరీలు బాదిన హీరోలు: భారీ స్కోర్

ఈ సారి వరల్డ్ కప్ మ్యాచ్‌లను ఐసీసీ ఓ నూతన ఫార్మాట్‌లో నిర్వహించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీని ప్రకారం.. సెమీఫైనల్స్, ఫైనల్స్ చేరే క్రమంలో మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి. మొదటగా ర్యాంకింగ్స్‌లో చివరి మూడు స్థానాల్లో ఉన్న లీగ్ జట్ల మధ్య సూపర్ సిరీస్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో అగ్రస్థానాన్ని కైవసం చేసుకునే జట్టు తదుపరి రెండో రౌండ్ ఆడటానికి అర్హత పొందుతుంది. ఆ తర్వాతే ప్రధాన లీగ్స్ మొదలవుతాయి.

మేనమామలా మోకాళ్లపై కూర్చుని బంగారపు ఉంగరాలను తొడిగిన విజయ్
మేనమామలా మోకాళ్లపై కూర్చుని బంగారపు ఉంగరాలను తొడిగిన విజయ్

రెండో దశలో అర్హత సాధించిన 12 జట్లను రెండు గ్రూపులుగా విభజించి రౌండ్ రాబిన్ పద్ధతిలో 30 మ్యాచ్‌లు ఆడిస్తారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు, రెండు గ్రూపుల్లో కలిపి ఎక్కువ పాయింట్లతో ఉన్న మరో జట్టుతో కలిపి మొత్తం ఏడు జట్లు సూపర్-7 దశకు వెళ్తాయి. అక్కడ 21 మ్యాచ్‌ల అనంతరం మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు సెమీఫైనల్స్ కు చేరుకుంటాయి.

ఈ మూడు దశల ఫార్మాట్ కారణంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠభరితంగా సాగనుంది. టైటిల్ పోరులో నిలిచే జట్టును తేల్చేందుకు నిర్వహించే సెమీస్ మ్యాచ్‌లలో మొదటి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంతో, రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానంతో తలపడతాయి. ట్రోఫీ విజేతను నిర్ణయించే గ్రాండ్ ఫైనల్ నవంబర్ 21న జరగనుంది. టికెట్లు బుక్ చేసుకోవడానికి అభిమానులు ఐసీసీ వేదికల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+