తెలంగాణలో ఇకపై ఆన్లైన్ లోనే కాదు మాన్యువల్‌గానూ భూముల డాక్యుమెంట్స్

తెలంగాణలో భూముల డాక్యుమెంట్ ల వ్యవహారం ఇకపై కేవలం ఆన్‌లైన్‌కే పరిమితం కాదు. ప్రభుత్వం మాన్యువల్‌గా కూడా క్షేత్రస్థాయిలో ఈ రికార్డులను అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. 2020లో ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత మాన్యువల్ పహాణీల నిర్వహణ ఆగిపోయింది. అప్‌డేట్లన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతూ వచ్చాయి. డిజిటల్ సమాచారంలో తప్పులు కనిపించినప్పుడు పాత రికార్డులను చూసి సరిచేసేవారు. కానీ పోర్టల్‌లో అప్‌డేట్ అయిన వివరాలు భౌతిక రూపంలో ఎక్కడా ఉండేవి కావు.

ఈ లోపాన్ని ఉపయోగించుకుని కొన్ని చోట్ల భూమి హక్కులు అక్రమంగా మార్చుకున్నారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా సమగ్ర రీ-సర్వే పూర్తయిన తర్వాత మాన్యువల్ డాక్యుమెంట్ లను అన్ని స్థాయిల్లో ఉంచనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1923 సర్వే అండ్ బౌండరీ చట్టం ప్రకారం తయారైన పాత నక్షాలే అమలులో ఉన్నాయి. తరాల తరాలుగా భూములు చేతులు మారినా సమగ్ర సర్వే జరగలేదు.

Telangana to Restore Manual Land Records Alongside Digital System records After land Re-Survey completion

దాంతో తాత్కాలిక సరిహద్దులతోనే యాజమాన్య హక్కులు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం ఆర్వోఆర్-2025 భూభారతి చట్టంలో రీ-సర్వేకు సంబంధించిన నిబంధనలు చేర్చింది. ఈ సర్వే పూర్తయితే సాదాబైనామా క్రమబద్ధీకరణ సులభం అవుతుంది. 22ఏ, వక్ఫ్, దేవాదాయ, అటవీ, రెవెన్యూ, పట్టా భూములపై ఉన్న వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. సరిహద్దులు కూడా స్పష్టంగా తేలుతాయి.

గత ఏడాది ఐదు జిల్లాల్లోని ఐదు గ్రామాల్లో పైలట్ సర్వే పూర్తయింది. నక్షాలు లేని 413గ్రామాల్లో కూడా ప్రయోగాత్మక సర్వే జరిగింది. ప్రస్తుతం ప్రతి జిల్లాకు 75గ్రామాలు ఎంపిక చేసి పైలట్ సర్వే కొనసాగుతోంది. ఇది వచ్చే నెల రెండో వారం నాటికి ముగుస్తుందని అంచనా. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పూర్తి స్థాయి రీ-సర్వే ప్రారంభించాలని రెవెన్యూ శాఖ ఆలోచిస్తోంది. దీనికోసం భూపరిపాలన ప్రధాన కమిషనర్ మార్గదర్శకాలు సిద్ధం చేశారు.

మండలానికి ఐదుగురు లైసెన్స్‌డ్ సర్వేయర్లను నియమించారు. గ్రామ పాలనాధికారులకు దశలవారీగా శిక్షణ ఇస్తున్నారు. రోవర్‌లు కొనుగోలు చేశారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు కూడా కొనుగోలు అధికారాలు ఇచ్చారు. భూముల డాక్యుమెంట్ లను డిజిటల్‌కే పరిమితం చేయకుండా మాన్యువల్‌గా ఉంచాలని భూభారతి చట్టంలోనే పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి తహసీల్దారు, ఆర్డీవో, జిల్లా కలెక్టరేట్, రాష్ట్ర స్థాయి వరకు అన్ని చోట్ల భూములకు సంబంధించి ఫిజికల్ డాక్యుమెంట్ లు ఉంటాయి. దీనివల్ల ఎక్కడైనా దస్త్రాలు పోయినా లేదా దిద్దుబాటు అవసరమైనా సులభంగా చెక్ చేసుకోవచ్చు.

టోల్ ప్లాజాల్లో ఆగే పని లేదు.. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్!
టోల్ ప్లాజాల్లో ఆగే పని లేదు.. మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో సిస్టమ్!

రీ సర్వేలో ఆబాదీ భూములను కూడా చేర్చనున్నారు. గ్రామాల్లో నివాసాలు ఉన్న ప్రాంతాలు, ప్రభుత్వం కేటాయించిన స్థలాలు, కాలక్రమేణా విస్తరించిన ఆబాదీ ప్రాంతాలన్నీ సర్వే చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఇంటి నంబరే ఆధారంగా ఉంది. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లేవు. రీ సర్వే తర్వాత ఈ స్థలాలకు హక్కులు కల్పించి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కలుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+