పేదల దేవుడు శివుడు.. ధనికుల దేవుడు రాముడు: రేవంత్ వ్యాఖ్యలు..!!

ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. జై శ్రీరాం అనే మోదీ.. హర హర మహా దేవ్ అని ఎందుకు అనరని ప్రశ్నించారు. శివుడు పేదల దేవుడు.. రాముడు సంపన్నుల దేవుడుగా రేవంత్ అభివర్ణించారు. దక్షిణాది వాళ్లు ద్రావిడులని, ఉత్తరాది వారు ఆర్యులని వ్యాఖ్యానించారు. తాము శివ భక్తులమని, వారు రామ భక్తులని చెప్పారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యల పైన స్పందిస్తున్నారు. రాజకీయ చర్చగా మారుతోంది.

ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పేదల దేవుడు శివుడు.. రాముడు ధనికుల దేవుడు అంటూ వ్యాఖ్యానించారు. ఒక మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో రేవంత్ ఈ ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ప్రధాని మోదీ ఎప్పుడైనా హరహర మహాదేవ్‌ అంటారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు వేదికలపై కేవలం జై శ్రీరామ్‌ మాత్రమే అంటారని ప్రస్తావించారు. శివుడు పేదల దేవుడని, శ్రీరాముడు సంపన్నుల దేవుడని, బీజేపీ సంపన్నుల పార్టీయేనని వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy Says Shiv Is God of Poor Ram Is God of Rich sparks new political debate

అవకాశం వస్తే మోదీని నిలదీస్తా ప్రధానిగా మన్మోహన్‌సింగ్‌ ప్రతిపక్ష పాలనలో ఉన్న గుజరాత్‌కు ఇచ్చిన మద్దతులో పదో వంతు కూడా మోదీ తెలంగాణకు ఇవ్వడం లేదని రేవంత్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. రీజినల్‌ రింగు రోడ్డు, మెట్రో రైలు, జాతీయ రహదారుల విస్తరణ ఫైళ్లు రెండేళ్లుగా పీఎంఓలోనే ఆగిపోయాయని తెలిపారు. నితిన్‌ గడ్కరీని అడిగినా ఫైల్‌ మోదీ వద్దే ఉందని చెబుతున్నారని వెల్లడించారు.

రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల బుకింగ్‌ పై TTD కీలక ప్రకటన, భారీ డిమాండ్ తో..!!

రేవంత్ వ్యాఖ్యల పై బీజేపీ నేతల కౌంటర్

తెలంగాణకు అన్ని హంగులు ఉన్నప్పటికీ చివరి నిమిషంలో సెమీకండక్టర్‌ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించుకుపోయారని ఆరోపించారు. మోదీ సంస్థలను బెదిరించి మరీ ప్రాజెక్టులను అక్కడికి తరలిస్తున్నారని మండిపడ్డారు. అవకాశం వస్తే మోదీని ఎదురుగా కూర్చోబెట్టి ఈ విషయాలపై నిలదీస్తానని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలను శిక్షించేలా డీలిమిటేషన్‌ చేపట్టొద్దని, 1976, 2001 మాదిరిగానే ప్రస్తుత లోక్‌సభ సీట్ల సంఖ్యను మరో 25 ఏళ్లు ఫ్రీజ్‌ చేయాలని ప్రధానిని డిమాండ్‌ చేశారు.

డీలిమిటేషన్‌ చేపడితే బీమారు రాష్ట్రాల సీట్లు విపరీతంగా పెరిగి, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ వంటి దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాభవం పూర్తిగా కనుమరుగవుతుందని చెప్పుకొచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మమతా బెనర్జీ, శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, స్టాలిన్‌ తదితర విపక్ష నేతలంతా ఏకమౌతారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+