అర్హతా కాలిక్యులేటర్‌తో పర్సనల్ లోన్ అర్హతను ఆన్లైన్ లో పరిశీలించుకోండి..!

మీ ఆదాయము, ప్రస్తుతం ఉన్న ఆర్ధిక బాధ్యతలు మరియు తిరిగిచెల్లింపు సామర్థ్యము వంటి కీలక అంశాల ఆధారంగా మీరు ఎంత ఋణము తీసుకోగలరు అనేది అర్థం చేసుకొనుటకు ఒక పర్సనల్ లోన్ అర్హతా కాలిక్యులేటర్ మీకు సహాయపడుతుంది. ఒక పర్సనల్ లోన్ కోసం మీరు దరఖాస్తు చేసే ముందు మీరు దీనిని ఆన్లైన్ లో ఉపయోగించవచ్చు. ఋణ మొత్తాలను పోల్చి చూడటానికి మరియు మీ తిరిగిచెల్లింపులను మరింత జాగ్రత్తగా ప్రణాళిక చేసుకొనుటకు కూడా ఇది మీకు సహాయపడగలదు.

పర్సనల్ లోన్ అర్హతా కాలిక్యులేటర్ తో, మీరు ఒక శాఖకు వెళ్ళకుండానే అంచనావేయబడిన మీ అర్హతను పరీక్షించుకోవచ్చు. మీరు ముఖ్యమైన ఖర్చును ప్రణాళిక చేస్తున్నా లేదా ఒక అత్యవసర ఆర్ధిక ఆవశ్యకత కోసం నిధులు అవసరమైనా ఇది మీకు ఒక ఉపయోగకరమైన ప్రారంభ చర్య.

personal-loan-eligibility-calculator-check-your-loan-eligibility-online

పర్సనల్ లోన్ అర్హతా కాలిక్యులేటర్ అంటే ఏమిటి?
ఒక పర్సనల్ లోన్ అర్హతా కాలిక్యులేటర్ మీకు అర్హత ఉన్న ఋణ మొత్తాన్ని అంచనా వేసే ఒక ఆన్లైన్ సాధానము. ఇది ఒక సూచనాత్మక ఫలితాలను అందించుటకు మీ ఆదాయము, ఉపాధి ప్రొఫైల్ మరియు ప్రస్తుతం ఉన్న ఆర్ధిక బాధ్యతల వంటి వివరాలను ఉపయోగిస్తుంది.

అసలైన అర్హత మరియు ఋణ నియమాలు వర్తించే ప్రమాణము మరియు ఋణదాత అంచనాలపై ఆధారపడి ఉంటాయి. అందుచేత, ఈ కాలిక్యులేటర్ ను ఆమోదానికి హామీగా కాకుండా కేవలం ఒక ప్రారంభ ప్రణాళికా సాధనముగానే ఉపయోగించాలి.

ఈ ఫలితాన్ని మీరు ఎంటర్ చేయబడిన వివరాల ఆధారంగా మీకు అర్హత కలిగిన ఋణ మొత్తాన్ని అంచనా వేయుటకు ఉపయోగించవచ్చు.

పర్సనల్ లోన్ అర్హతా కాలిక్యులేటర్ ఎలా పనిచేస్తుంది?
కాలిక్యులేటర్ ను ఉపయోగించడం సులభం. మీరు కావలసిన వ్యక్తిగత మరియు ఆర్ధిక వివరాలను ఎంటర్ చేస్తారు మరియు కాలిక్యులేటర్ మీ సంభావ్య అర్హతను అంచనావేస్తుంది.
ఈ లెక్కింపు ఈ క్రింది అంశాలను పరిగణిస్తుంది:

  • నెలవారి ఆదాయము
  • ప్రస్తుత ఋణాలు లేదా ఈఎంఐ బాధ్యతలు
  • ఇతర వర్తించే అర్హతా అంశాలు

ఉదాహరణకు, మీరు ఇంటి పునరుద్ధరణను ప్రణాళిక చేస్తుంటే, ప్రతిపాదిత ఋణము మీ నెలవారి తిరిగిచెల్లింపును ఏ విధంగా ప్రభావితం చేయగలదు అని అర్థంచేసుకోవటానికి మీరు మీ ఆదాయము మరియు ప్రస్తుతం ఉన్న బాధ్యతలను ఎంటర్ చేయవచ్చు.

ప్రో టిప్: కాలిక్యులేటర్ ఉపయోగించే ముందు, మీ ఆదాయము మరియు ప్రస్తుత ఈఎంఐ వివరాలను సిద్ధంగా ఉంచుకోండి. ఖచ్ఛితమైన సమాచారము మీరు మరింత ఉపయోగకరమైన అంచనా పొందుటలో సహాయపడుతుంది.

పర్సనల్ లోన్ అర్హతను మీరు ఆన్లైన్ లో ఎందుకు పరీక్షించుకోవాలి?
దరఖాస్తు చేసే ముందు అర్హతను పరీక్షించుకోవడం అనేది మీరు మరింత అవగాహన కలిగిన ఋణ నిర్ణయాన్ని తీసుకొనుటకు మీకు సహాయపడుతుంది. మీరు తిరిగిచెల్లించుటకు కష్టంగా ఉన్న ఋణ మొత్తాన్ని ఎంచుకోకుండా కూడా ఇది మీకు సహాయపడుతుంది.
ఒక ఆన్లైన్ అర్హత పరీక్ష మీకు ఈ విధంగా ఉపయోగపడుతుంది:

  • మీకు అర్హత ఉన్న ఋణ మొత్తాన్ని అంచనా వేయుటకు
  • మీ నెలవారి తిరిగిచెల్లింపులను ప్రణాళిక చేయుటకు
  • వివిధ ఋణ మొత్తాలను మరియు కాలవ్యవధులను పోల్చి చూచుటకు
  • మీ ప్రస్తుత ఆర్ధిక బాధ్యతలను సమీక్షించుటకు
  • దరఖాస్తు చేసే ముందు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేసుకొనుటకు
  • మరింత అవగాహన కలిగిన ఋణ నిర్ణయాన్ని తీసుకొనుటకు

ఒక శాఖను సందర్శించకుండా ఎక్కడి నుండైనా మీరు అంచనావేయబడిన మీ అర్హతను పరీక్షించుకొనుటకు కూడా ఈ ఆన్లైన్ ప్రక్రియ మీకు సహాయపడుతుంది.

పర్సనల్ లోన్ అర్హతను ఏయే అంశాలు ప్రభావితం చేస్తాయి?

మీ పర్సనల్ లోన్ అర్హత అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఋణదాతలు మీ ఆదాయము, ఉపాధి వివరాలు, వయసు, క్రెడిట్ ప్రొఫైల్, ప్రస్తుత బాధ్యతలు మరియు తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని సమీక్షించవచ్చు.

ప్రస్తుతం ఉన్న మీ ఈఎంఐలు కూడా ముఖ్యమైనవి. మీ ఆదాయములో ఎక్కువ భాగం తిరిగిచెల్లింపులకై ఇప్పటికే కేటాయించబడితే, మరొక ఈఎంఐ తీసుకోవడం మీ బడ్జెట్ పై ఒత్తిడిని కలిగించవచ్చు.

ఒక ఋణ మొత్తాన్ని నిర్ణయించుకునే ముందు మీ నెలవారి ఆదాయము మరియు ఖర్చులను సమీక్షించుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక కాలవ్యవధి నెలవారి ఈఎంఐని తగ్గించవచ్చు కాని అది ఋణ కాలములో చెల్లించబడే వడ్డీని పెంచవచ్చు.

బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ తో మీరు ఎంత ఋణం తీసుకోవచ్చు?
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్, వర్తించే అర్హత మరియు అంచనాలకు లోబడి రూ. 40,000 నుండి రూ. 55 లక్షల వరకు ఉండే ఋణ మొత్తాన్ని అందిస్తుంది.
తిరిగిచెల్లింపు కాలవ్యవధి 12 నెలల నుండి 108 నెలల వరకు ఉండవచ్చు. వడ్డీ రేట్లు, వర్తించే నియమాలు మరియు దరఖాస్తుదారుడి ప్రొఫైల్ ఆధారంగా ఏడాదికి 10% నుండి 30.5% వరకు ఉండవచ్చు.

పర్సనల్ లోన్ కోసం ఎలాంటి తనఖా పెట్టవలసిన పనిలేదు. ఇది అర్హతకు లోబడి, ప్రణాళిక.చేయబడిన అవసరాలను నిర్వహించుటకు లేదా అత్యవసర ఆర్ధిక అవసరాలను నెరవేర్చుకొనుటకు ఒక సౌకర్యవంతమైన విధానాన్ని అందిస్తుంది.

ఒక పర్సనల్ లోన్ ను మీరు దేనికి ఉపయోగించవచ్చు?
మీరు ఒక పర్సనల్ లోన్ ను అనేక ప్రణాళిక చేయబడిన మరియు అనుకోని ఖర్చుల కోసం ఉపయోగించవచ్చు. సాధారణ వినియోగాలు:
వైద్య అత్యవసర పరిస్థితులు
అనుకోని వైద్య ఖర్చులు మీ పొదుపులపై ఒత్తిడి వేయవచ్చు. ఒక పర్సనల్ లోన్ అందుబాటులో ఉన్న మీ పొదుపు మొత్తాన్ని పూర్తిగా ఉపయోగించకుండా అర్హత కలిగిన వైద్య ఖర్చులను నిర్వహించుటకు సహాయపడుతుంది.
ప్రయాణము

మీరు ఒక పర్సనల్ లోన్ ను ప్రణాళిక చేయబడిన ఒక హాలీడే కొరకు ఉపయోగించవచ్చు. అయితే, నెలవారి తిరిగిచెల్లింపు మీ బడ్జెట్ లో సౌకర్యవంతంగా సరిపోతుందా అనేది పరిశీలించడం ముఖ్యం.

విద్య
కోర్స్ ఫీజు, వృత్తిపరమైన శిక్షణ మరియు ఇతర విద్యా-సంబంధమైన ఖర్చులకు పెద్దమొత్తములో నిధులు అవసరం కావచ్చు. ఇటువంటి ఖర్చులను క్రమమైన తిరిగిచెల్లింపుల ద్వారా నిర్వహించుకొనుటకు ఒక పర్సనల్ లోన్ మీకు సహాయపడవచ్చు.
పెళ్ళి ఖర్చులు
పెళ్ళికి కల్యాణమంటపం ఖర్చులు, ప్రయాణం మరియు ఇతర ఏర్పాట్ల సహా అనేక ఖర్చులు ఉండవచ్చు. నెలవారి తిరిగిచెల్లింపు ద్వారా ప్రణాళిక చేయబడిన ఖర్చులను నిర్వహించుకొనుటకు ఒక పర్సనల్ లోన్ మీకు సహాయపడుతుంది.
ఇంటి పునరుద్ధరణ
మరమ్మత్తులు, ఆధునీకరణలు లేదా మెరుగుదల వంటి అర్హమైన పునరుద్ధరణ ఖర్చుల కోసం మీరు నిధులను ఉపయోగించవచ్చు. అవసరమైన మొత్తాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవడం వలన మీరు అనవసరంగా ఋణము తీసుకోరు.

ఒక పర్సనల్ లోన్ కోసం మీరు ఆన్లైన్ లో మీరు ఎలా దరఖాస్తు చేయవచ్చు?
మీరు అంచనావేయబడిన మీ అర్హతను పరీక్షించుకున్న తరువాత, ఋణము మీ ఆర్ధిక అవసరాలకు తగినది అయితే, మీరు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియలో సాధారణంగా మూడు దశలు ఉంటాయి:

1. ఋణ అర్హతను పరీక్షించండి - బజాజ్ ఫైనాన్స్ వెబ్సైట్ పై పర్సనల్ లోన్ పేజీ ని సందర్శించండి, మీకు కావలసిన ఋణ మొత్తాన్ని ఎంటర్ చేయండి, తిరిగి చెల్లింపు కాలాన్ని ఎంపిక చేయండి మరియు మీ ఋణ అర్హతను పరీక్షించటానికి "ఋణ ఆఫర్ పరీక్షించు" పై క్లిక్ చేయండి.

2. వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయండి - వ్యక్తిగతీకరించబడిన ఋణ ఆఫర్ ను అందుకొనుటకు మీ వ్యక్తిగత, ఆర్ధిక మరియు ఉపాధి వివరాలను అందించండి.

3. మీ ఋణ ఆఫర్ ను సమీక్షించండి - మీ ఆఫర్ వివరాలను పరీక్షించండి మరియు అవసరమైతే, ఋణ మొత్తాన్ని లేదా తిరిగిచెల్లింపు కాలవ్యవధిని సరిచేయండి.

4. కేవైసి ధృవీకరణను పూర్తి చేయండి - మీ దరఖాస్తును ముందుకు కొనసాగించేందుకు మీ గుర్తింపు మరియు బ్యాంక్ వివరాలను ధృవీకరించండి.

5. ఋణ నిపుణుడితో మాట్లాడండి - మీ దరఖాస్తు సబ్మిట్ చేయబడిన తరువాత, తదుపరి చర్యల కోసం ఒక ఎక్సిక్యూటివ్ మిమ్మల్ని సంప్రదిస్తారు.

ప్రో టిప్: కేవలం మీరు అర్హులు కదా అని అందుబాటులో ఉన్న అత్యధిక ఋణ మొత్తాన్ని ఎంచుకోకండి. మీకు అవసరమైన మొత్తం మరియు తిరిగిచెల్లింపు సామర్థ్యాని సరిపోలే మొత్తాన్ని ఎంచుకోండి.

మీకు ఏయే దస్తావేజులు అవసరం ఉంటాయి?
బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ కోసం నామమాత్రంగానే దస్తావేజులు అవసరం అవుతాయి. దరఖాస్తు సమయములో అయిదు కీలక వర్గాలను కవర్ చేసే దస్తావేజులను మీరు అందించవలసి ఉంటుంది. మీ ప్రొఫైల్ మరియు వర్తించే దరఖాస్తు ప్రక్రియ ఆధారంగా కావలసిన అసలైన దస్తావేజులు మారవచ్చు.

అవసరమైన దస్తావేజులను సిద్ధంగా ఉంచుకోవడం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను సరళం మరియు వేగవంతం చేయడములో సహాయపడుతుంది.

దస్తావేజు వర్గము అంగీకరించబడే ఎంపికలు
KYC రుజువు ఆధార్ / పాస్పోర్ట్ / వోటర్ ఐడి / డ్రైవింగ్ లైసెన్స్ / నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ లేఖ / ఎన్‎ఆర్‎ఈజిఏ జాబ్ కార్డ్
గుర్తింపు రుజువు PAN కార్డు, వాస్తవ-సమయ చిత్రము / ఫోటో
ఉద్యోగం రుజువు ఉద్యోగి ఐడి కార్డు, ఉద్యోగ యజమాని జారీ చేసిన వసతి కేటాయింపు లేఖ
ఆదాయ రుజువు వేతన చీటీలు - గత 3 నెలలు, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ - గత 3 నెలలు
ఇతరములు పెన్షన్ ఆర్డర్, యుటిలిటి బిల్, ఫోన్ బిల్, పైప్డ్ గ్యాస్ బిల్, ఆస్తి / మునిసిపల్ పన్ను రసీదు

పర్సనల్ లోన్ ఒక సౌకర్యవంతమైన ఆర్ధిక ఎంపికేనా?

పర్సనల్ లోన్ కొరకు తనఖా పెట్టవలసిన పనిలేదు మరియు దీని కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేయవచ్చు కాబట్టి ఇది చాలా సౌకర్యవంతమైనది. ఇది వివిధ ప్రణాళిక చేయబడిన లేదా అత్యవసర ఖర్చుల కోసం నిధులను కూడా అందించగలదు.

అయితే, జాగ్రత్తగా ఆర్ధిక ప్రణాళిక చేసుకోవడానికి బదులు సౌకర్యం మాత్రమే చూసుకోకూడదు. మీరు ఋణము తీసుకునే ముందు మీ ఆదాయము, ప్రస్తుత ఈఎంఐలు, నిత్య ఖర్చులు, వడ్డీ రేటు మరియు తిరిగిచెల్లింపు కాలవ్యవధులను పరిగణించాలి.

బాధ్యతాయుతంగా ఋణము తీసుకోవడం అంటే, మీకు కావలసినంత మొత్తాన్ని మాత్రమే ఋణముగా తీసుకోవడం మరియు తిరిగిచెల్లించడం మీ నెలవారి బడ్జెట్ కు సరిపోతుంది అని నిర్ధారించడం.

మీ పర్సనల్ లోన్ అర్హతను ఆన్లైన్ లో పరీక్షించుకోండి
పర్సనల్ లోన్ అర్హతా కాలిక్యులేటర్ మీరు ఋణము కొరకు దరఖాస్తు చేసే ముందు మీ ఋణము తీసుకునే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడములో సహాయపడగలదు. ఇది కీలక అంశాలను సమీక్షించుకొనుటకు, మీ తిరిగిచెల్లింపును ప్రణాళిక చేసుకొనుటకు మరియు మీ ఆర్ధిక అవసరాల ఆధారంగా ఋణ మొత్తాన్ని ఎంచుకొనుటకు అవకాశం ఇస్తుంది.

మీరు బజాజ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటే, ముందుకుసాగేముందు ఆన్లైన్ లో మీ అర్హతను పరీక్షించుకోండి మరియు వర్తించే ఋణ నియమాలను సమీక్షించుకోండి. ఒకవేళ ఋణము మీ ఆవశ్యకతకు మరియు తిరిగిచెల్లింపు సామర్థ్యానికి సరిపోతే, నామమాత్రపు డాక్యుమెంటేషన్ మరియు సౌకర్యవంతమైన దరఖాస్తు ప్రక్రియతో ఒక పర్సనల్ లోన్ కోసం మీరు దరఖాస్తు చేయవచ్చు.
*షరతులు వర్తిస్తాయి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+