మోహన్‌బాబు వల్ల వరుస ఫ్లాపుల నుంచి బయటపడ్డ మెగాస్టార్ చిరంజీవి

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు ఉన్నాయి. కానీ, ఆయన ఇమేజ్‌ను, కెరీర్ గ్రాఫ్‌ను పూర్తిగా మార్చివేసి, సరికొత్త మలుపు తిప్పిన చిత్రాల్లో 'హిట్లర్' ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో విడుదలైన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించడమే కాకుండా చిరుకు బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చింది. 1997 జనవరి 4న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందాం.

మొగల్తూరులో రూ.3 లక్షలకు ఇల్లు అమ్మేసిన విమర్శపై ఇప్పుడు స్పందించిన చిరంజీవి
మొగల్తూరులో రూ.3 లక్షలకు ఇల్లు అమ్మేసిన విమర్శపై ఇప్పుడు స్పందించిన చిరంజీవి

నటీనటుల అద్భుతమైన అభినయం

ఈ సినిమా విజయంలో నటీనటుల పాత్ర చాలా కీలకం. చిరంజీవి కేవలం మాస్, యాక్షన్ సినిమాలే కాకుండా, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాల్లోనూ తాను నటనతో మెప్పించగలనని నిరూపించారు. చెల్లెళ్ల పట్ల చూపే కఠినత్వం వెనుక ఉండే ఆవేదనను, హావభావాలను ఆయన పండించిన తీరు ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. అలాగే, రంభ గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవగా, చిరంజీవి బావగా నటకిరీటి రాజేంద్రప్రసాద్ తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్విచ్చారు. ఇక తండ్రి పాత్రలో దర్శకరత్న దాసరి నారాయణరావు జీవించారు. బ్రహ్మానందం, సుధాకర్ కాంబినేషన్ కామెడీకి థియేటర్లలో నవ్వుల వర్షం కురిసింది. ఎల్.బి. శ్రీరామ్ రాసిన మాటలు గుండెను హత్తుకునేలా ఉంటాయి.

చిరంజీవి వద్దంటే బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టాడు
చిరంజీవి వద్దంటే బాలయ్య బ్లాక్ బస్టర్ కొట్టాడు
Megastar Chiranjeevi broke free from a string of flops thanks to Mohan Babu

ఆసక్తికరమైన నిజాలు

ఈ కథను మొదట చిరంజీవి కోసం అనుకోలేదు. నిర్మాత ఎడిటర్ మోహన్ ఈ హక్కులు కొనుగోలు చేసినప్పుడు, మోహన్ బాబు హీరోగా ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వంలో సినిమా చేయాలని భావించారు. కానీ కాల్షీట్లు కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్ చిరంజీవి వద్దకు వచ్చింది. మోహన్ బాబు డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఈ అద్భుతమైన కథ చిరు చేతికి వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 1995లో వచ్చిన 'రిక్షావోడు' పరాజయం తర్వాత చిరంజీవి సుమారు ఏడాది పాటు గ్యాప్ తీసుకున్నారు. దాంతో అప్పట్లో దర్శకుడు ముత్యాల సుబ్బయ్యకు చిరంజీవి అభిమానుల నుంచి "సినిమా కచ్చితంగా హిట్ కావాలి" అంటూ భారీగా ఉత్తరాలు వచ్చాయట.

ఫ్యాన్స్ అంచనాలను అందుకుంటూ సుబ్బయ్య తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 42 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుని ఘన విజయం సాధించింది. మాస్ ఇమేజ్ ఉన్న హీరోతో అప్పట్లో ఒక బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమా తీసి సక్సెస్ సాధించడం సాహసమనే చెప్పాలి. నేటికీ టీవీల్లో వస్తే కుటుంబమంతా కలిసి చూసే ఆల్‌టైమ్ క్లాసిక్ ఎంటర్‌టైనర్‌గా 'హిట్లర్' నిలిచిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+