బంగాళాఖాతంలో మరో వాయుగుండం - భారీ వర్షాలు, ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!!
వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. ఉత్తర అండమాన్.. దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ ప్రభావంతో సాయంత్రం నుంచి ఏపీ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురస్తాయని హెచ్చరించింది.
సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ అల్పపీడనం మరింత బలపడుతుందని అంచనా వేసింది. ఈనెల 23 లేదా 24 వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండం లేదా తుఫానుగా ఉత్తర కోస్తా - దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వాన దంచి కొడుతోంది. శ్రీకాకుళం, విజయ నగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి,కాకినాడ పలు కోస్తా జిల్లాల్లోవానలు కురుస్తున్నాయి. రేపటి నుంచి మరింత పుంజుకొనున్న వర్షాలు మరిన్ని జిల్లాలకు విస్తరిస్తాయని పేర్కొన్నారు.

మూడు రోజులు వర్షాలు
అదే విధంగా సోమవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా, మంగళవారం నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు. బుధవారం ఉదయానికి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర తీరాలకు సమీపంలోని పశ్చిమ మధ్య.. దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకునే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి తిరిగి రావాలని.. కొత్తగా ఎవరూ సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.













Click it and Unblock the Notifications
