లిక్కర్ కేసులో సత్యప్రసాద్ స్టేట్మెంట్ ఎలా సాక్ష్యం అవుతుంది..!!

లిక్కర్ కేసులో తాజా పరిణామాలు ఆసక్తిగా మారాయి. సత్యప్రసాద్ ఇచ్చిన వాంగ్మూల్ తో ఈ కేసు కొత్త టర్న్ తీసుకుంది. జగన్ లక్ష్యంగా చెప్పిన అంశాలతో ఈ వ్యవహారం కీలక దశకు చేరుకుంది. కాగా, సత్యప్రసాద్ వాంగ్మూలం పైన వైసీపీ నేతలు స్పందించారు. కీలక విషయాన్ని తెర మీదకు తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో డీఎస్సీ వ్యవహారంలోనూ ప్రశ్నలు కొనసాగిస్తున్నారు. వీటి పైన మాజీ మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

డీఎస్సీ-2025 నియామకాల్లో ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్ల వినియోగంపై వైయ‌స్ఆర్‌సీపీ మాజీ మంత్రి పేర్ని నాని కీలక అంశాలను ప్రస్తావించారు. బీసీ-డీ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ సర్టిఫికెట్లు జారీ చేసి, వాటి ఆధారంగా టీచర్‌ ఉద్యోగాలు పొందిన వ్యవహారంపై సమగ్రంగా పరిశీలన జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సంబంధిత అభ్యర్థుల ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లను జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే వెరిఫై చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లు పొందినట్లు తేలితే చర్యలు తీసుకుని, అర్హత ఉన్న న్యాయమైన అభ్యర్థులకు పోస్టులు దక్కేలా చూడాలని పేర్ని నాని కోరారు. డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై పూర్తి స్థాయి పరిశీలనతో వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. అదే విధంగా రాష్ట్రంలో కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా రాజకీయ అంశాలకే ప్రాధాన్యత ఇస్తోందని పేర్ని నాని విమర్శించారు.

కడప సీటు అతనికి ఇవ్వండి.. కూటమి కీలక నేతకు సునీత సిఫారసు..!?
కడప సీటు అతనికి ఇవ్వండి.. కూటమి కీలక నేతకు సునీత సిఫారసు..!?
ysrcp-leader-perni-nani-made-interesting-comments-over-latest-developments-in-liquor-case-here-the

లిక్కర్ కేైసులో కీలక పరిణామాల వేళ

లిక్కర్‌ కేసులో సిట్‌ దర్యాప్తుపై కూడా ఆయన పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఇప్పటివరకు సిట్‌ దర్యాప్తులో ఒక్క రూపాయి కూడా స్వాధీనం కాలేదని, దర్యాప్తు టీవీ సీరియల్‌లా సాగుతోందని వ్యాఖ్యానించారు. టీటీడీ శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందంటూ గతంలో ప్రచారం జరిగిందని పేర్ని నాని ప్రస్తావించారు. ఆ నెయ్యిలో జంతు కొవ్వు కలిసినట్లు నిర్ధారణ కాలేదని ఈడీ పేర్కొందని ఆయన తెలిపారు. అధికారులు రాజకీయ నాయకుల్లాగా కౌంటర్లు ఇస్తే సరిపోదని వ్యాఖ్యానించారు. చాలామంది ఐఏఎస్ అధికారులు డిల్లీ వెళ్లిపోతున్నారు అని పేర్కొన్నారు. 2014 నుంచి సత్యప్రసాద్ మానసిక స్థితి బాగోలేదని మెడికల్ సర్టిఫికెట్ కూడా ఉందని.. అనంతపురం వైద్యులు 2024 ఆగష్టులో ఈ సర్టిఫికెట్ ఇచ్చారని చెప్పారు. గత పదేళ్లు గా చికిత్స పొందుతున్న మానసిక రోగి సాక్ష్యంతో జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారని.. సత్య ప్రసాద్ స్టేట్మెంట్ ఎలా సాక్ష్యం అవుతుందని పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+