మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ 'కల్ట్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ హీరోగా నటిస్తున్న సరికొత్త సినిమా 'కల్ట్' విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు స్పష్టం చేశారు. భారతదేశపు మొట్టమొదటి స్లాషర్ థ్రిల్లర్ డార్క్ సినిమాటిక్ యూనివర్స్‌గా రాబోతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అల్లు అర్జున్ 'రాకా' ముందు అవతార్‌ కూడా జుజుబీనే.. అంతకు మించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌..!
అల్లు అర్జున్ 'రాకా' ముందు అవతార్‌ కూడా జుజుబీనే.. అంతకు మించిన విజువల్‌ ఎఫెక్ట్స్‌..!

తొలిసారి నెగెటివ్ షేడ్స్
విడుదల తేదీకి సంబంధించి నిర్మాతలు విడుదల చేసిన చిన్న వీడియో గ్లింప్స్ నెట్టింట విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో విశ్వక్‌సేన్ అత్యంత కోపంగా, పవర్‌ఫుల్‌గా, హింసాత్మకమైన అవతారంలో కనిపించారు. ఈ సినిమా కోసం డిజైన్ చేసిన డార్క్ ప్రపంచాన్ని ఈ దృశ్యం పరిచయం చేయడం కాకుండా, విశ్వక్‌సేన్ తన కెరీర్లోనే తొలిసారిగా పూర్తిస్థాయి నెగెటివ్ ఛాయలున్న పాత్రను పోషిస్తున్నారని స్పష్టమవుతోంది.

Vishwak Sen Cult Movie Release Date Fixed Slasher Thriller in Theatres October 30 Full Details Here
సడెన్ గా ఓటీటీలోకి తెలుగు హార‌ర్ థ్రిల్లర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు..!
సడెన్ గా ఓటీటీలోకి తెలుగు హార‌ర్ థ్రిల్లర్ మూవీ.. అస్సలు మిస్ కావొద్దు..!

విశ్వక్‌సేన్ స్వీయ దర్శకత్వం

ఈ సినిమాకు విశ్వక్‌సేన్ స్వయంగా రచన, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తుండటం మరో విశేషం. నటుడిగా, దర్శకుడిగా ఆయన సృజనాత్మక కోణాన్ని ఈ సినిమా ప్రతిబింబించనుంది. సమాజంలోని కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను, స్క్రీన్‌ప్లేను రూపుదిద్దినట్లు సమాచారం. తారక్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సందీప్ కకరాల ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విడుదల తేదీని ఖరారు చేయడంతో త్వరలోనే ట్రైలర్, టీజర్లతో పాటు ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను నిర్మాతలు అధికారికంగా వెల్లడించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+