అల్లు అర్జున్ 'రాకా' ముందు అవతార్ కూడా జుజుబీనే.. అంతకు మించిన విజువల్ ఎఫెక్ట్స్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డుల్ని తిరగరాసింది. ఏకంగా రూ. 2 వేల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. నార్త్ ఇండియాలో పుష్ప- 2 సినిమా జాతరను తలపించింది. అటు ఓవర్సీస్ లోనూ సంచలన వసూల్లు నమోదు చేసింది. దాంతో అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే దర్శకుడు అట్లీ చెప్పిన రాకా మూవీ స్టోరీ నచ్చడంతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్, జవాన్ మూవీ తర్వాత అట్లీ నుంచి వస్తున్న సినిమా కావడంతో రాకా మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాంతో ఇండియాలోనే సినీ ప్రేక్షకులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రాకా నిలిచింది.
అయితే తాజాగా ఈ మూవీ నుంచి సంచలన అప్డేట్ ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రాకా సినిమాపై తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి ప్రశంసలు కురిపించారు. అవతార్ విజువల్స్ ను మించే స్థాయిలో 'రాకా' లో సన్నివేశాలు ఉంటాయని అన్నారు. రాకాలోని కొన్ని సీన్స్ అట్లీ తనకు చూపించారని భారతీయ సినీ రంగానికి గర్వకారణంగా నిలిచే సినిమాను అట్లీ తీస్తున్నారని కొనియాడారు. దర్శకధీరుడు రాజమౌళి ఎలాగైతే భారత సినీ పరిశ్రమను ముందుకు తీసుకెళ్తున్నారో.. దర్శకుడు అట్లీ కూడా 'రాకా'మూవీతో ఇండస్ట్రీని ప్రపంచం ముందు మరింత అందనంత ఎత్తులో నిలబెడతారని తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇక రాకా నుంచి సెప్టెంబర్ 21 న స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఆ రోజున అట్లీ బర్త్ డే సందర్భంగా ఈ గ్లింప్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఇటీవల చిత్రబృందం '37' పోస్టర్ తో పాటు ఓ ప్రత్యేక వీడియో విడుదల చేయడంతో ఈ గ్లింప్స్ లో ఏం చూపిస్తారన్నదానిపై ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు రాకా మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతోంది. దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. రాకా మూవీలో హాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
