అమెరికా-ఇరాన్ వివాదంలోకి ప్రభాస్!

సోషల్ మీడియాలో వింత కాంబినేషన్లు తరచుగా కనిపిస్తుంటాయి. కానీ ఇరాన్ దౌత్యవర్గాలు, టాలీవుడ్ మధ్య బంధం మాత్రం ఊహించని రీతిలో పెరిగిపోతోంది. ఇటీవల నందమూరి బాలకృష్ణ సినిమా క్లిప్‌తో డొనాల్డ్ ట్రంప్‌ను ట్రోల్ చేసిన ఇరాన్.. ఇప్పుడు ఏకంగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'బాహుబలి' సినిమాను రంగంలోకి దించింది. అమెరికాతో సాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ ఇరాన్ చేస్తున్న దౌత్యపరమైన కామెంట్లకు టాలీవుడ్ మాస్ సీన్లు ప్రధాన ఆకర్షణగా మారడం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఆ మూవీ చూశాక నాకు నిద్ర పట్టలేదు: సూపర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్
ఆ మూవీ చూశాక నాకు నిద్ర పట్టలేదు: సూపర్ స్టార్ ఎమోషనల్ కామెంట్స్

హైదరాబాద్‌లోని ఇరాన్ కాన్సులేట్ తాజాగా తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో 'బాహుబలి: ది బిగినింగ్' సినిమాలోని ఐకానిక్ యుద్ధ ఘట్టాన్ని పంచుకుంది. ప్రభాస్ కాలకేయులతో తలపడే ఈ భారీ పోరాట దృశ్యాన్ని పోస్ట్ చేస్తూ.. ఇటీవల ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ చేసిన కామెంట్లను దానికి జోడించారు. ఏ రకమైన విదేశీ ఒత్తిళ్లకు ఇరాన్ లొంగబోదని, ఎంతటి శక్తివంతమైన శత్రువునైనా నెగ్గుకొస్తుందని చెప్పడానికి ప్రభాస్ 'బాహుబలి' యుద్ధ సన్నివేశాన్ని ఉదాహరణగా ఉపయోగించారు.

Iran Uses Prabhas Baahubali Scene To Troll Donald Trump Amid US Tensions after Balakrishna Scene

టాలీవుడ్‌ను ఇరాన్ దౌత్యవేత్తలు తమ రాజకీయ సందేశాలకు ఉపయోగించడం ఇదే తొలిసారి కాదు. కొద్దిరోజుల క్రితం జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ.. బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' సినిమాలోని ఓ పవర్‌ఫుల్ క్లిప్‌ను పోస్ట్ చేస్తూ డొనాల్డ్ ట్రంప్ కామెంట్లకు కౌంటర్ ఇచ్చింది.అయితే ఆ సమయంలో వారు తెలుగు సినిమాను బాలీవుడ్ అని పొరపాటుగా సంబోంధించడంతో సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఈ వివాదం సద్దుమణిగేలోపే ఇప్పుడు ప్రభాస్ ఎంట్రీతో రచ్చ మొదలైంది.

'నా శరీరం.. నా ఇష్టం': రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్!
'నా శరీరం.. నా ఇష్టం': రాధికా ఆప్టే బోల్డ్ కామెంట్స్!

బాహుబలి సినిమాలోని ప్రతిష్టాత్మకమైన పోరాట సన్నివేశాలు ఇరాన్ ఇస్తున్న దౌత్యపరమైన హెచ్చరికలకు సరైన సినిమాటిక్ పంచ్ ఇచ్చాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. బాలకృష్ణతో ప్రారంభమైన ఈ ఊహించని ట్రెండ్ ఇప్పుడు ప్రభాస్ దాకా రావడం విశేషం. గ్లోబల్ లెవెల్లో సాగుతున్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ తమ దేశ బలాన్ని, తెగువను చాటిచెప్పడానికి ఇరాన్ రాయబార కార్యాలయాలు తెలుగు సినిమా పవర్, టాలీవుడ్ స్టార్ల ఇమేజ్‌ను విరివిగా వాడుకుంటుండటం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+