ఓటుకు నోటు కేసులో రేవంత్‌ రెడ్డికి బిగ్ రిలీఫ్..!!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఓటు కు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటు కు నోటు కేసు వెలుగు లోకి వచ్చింది. ఈ కేసులో రేవంత్ తో సహా మరి కొంత మంది కేసు నమోదైంది. అయితే, తాజాగా ఈ కేసులో సీఎం రేవంత్ తో పాటుగా ఇతర నిందితులకు అప్పీలేట్ ట్రిబ్యునల్ ఊరటనిచ్చింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ జప్తు చేసిన రూ.50 లక్షల అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఇప్పుడు ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ఓటు కేసులో అనూహ్య పరిణామం. 2015 మే 31న తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసులో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి, ఇతర నిందితులకు అప్పీలేట్ ట్రిబ్యునల్ ఊరట దక్కింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ జప్తు చేసిన రూ.50 లక్షల అటాచ్‌మెంట్‌ ఉత్తర్వులను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికల వేళ రూ.5 కోట్ల లంచం ఆఫర్‌లో భాగంగా రూ. 50 లక్షల అడ్వాన్స్ మొత్తాన్ని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా స్వాధీనం చేసుకున్నారు.

రేవంత్ సర్కార్‌పై కవిత సమరభేరి!
రేవంత్ సర్కార్‌పై కవిత సమరభేరి!
CM Revanth Reddy and others accused Gets Relief in Vote-for-Note Case here the full details

దాన్ని ట్రయల్ కోర్టు కస్టడీకి అప్పగించారని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. నేరానికి సంబంధించిన ఆ సొమ్ము ఇప్పటికే కోర్టు కస్టడీలో ఉన్నప్పుడు, ఈడీ మళ్లీ అదే మొత్తానికి సమానమైన ఆస్తులను లేదా నిధులను అటాచ్ చేయడానికి వీల్లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. నాడు ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కుదిపేసింది. నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఈ కేసులో చిక్కుకున్న రేవంత్ రాజకీయ భవిష్యత్ పైనా ప్రభావం చూపింది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ ఎల్విస్ స్టీవెన్సన్‌కు ఓటు వేయడం కోసం రూ. 50 లక్షలు ఇస్తూ ఏసీబీ చేతికి చిక్కటంతో ఈ కేసు తెర మీదకు వచ్చింది. ఆ తరువాత తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. రేవంత్‌ టీడీపీ వీడి కాంగ్రెస్ పార్టీ వైపు అడుగులు వేయడం, పీసీసీ అధ్యక్షుడిగా మారడం, ఆపై రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి కావడం జరిగాయి. రేవంత్ సీఎం అయిన తరువాత ఈ పాత కేసులోని ఈడీ అటాచ్‌మెంట్‌పై అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఈ తీర్పు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఖైరతాబాద్ తో పాటుగా మరో నియోజకవర్గానికి ఉప ఎన్నిక, రేవంత్ బిగ్ ప్లాన్..!!
ఖైరతాబాద్ తో పాటుగా మరో నియోజకవర్గానికి ఉప ఎన్నిక, రేవంత్ బిగ్ ప్లాన్..!!

ఈ కేసులో అప్పట్లో రేవంత్‌ రెడ్డితో పాటు వేం నరేంద్ర రెడ్డి కుమారుడు వేం కృష్ణ కీర్తన్ రెడ్డి, రుద్ర శివకుమార్ ఉదయ్ సింహా, బిషప్ హ్యారీ సెబాస్టియన్ తదితరులు నిందితులుగా ఉన్నారు. ఈడీ జరిపిన ప్రొవిజనల్ అటాచ్‌మెంట్‌ను ఢిల్లీ కేంద్రంగా ఉన్న జస్టిస్ మునీశ్వర్ నాథ్ భండారి నేతృత్వంలోని ట్రిబ్యునల్ తప్పుపట్టింది. లంచం సొమ్ము ఇప్పటికే కోర్టు ఆధీనంలో ఉన్నప్పుడు, నిందితులు ఆ నిధులను వేరే విధంగా మళ్లించే అవకాశం లేనందున ఈడీ చర్య చెల్లదని స్పష్టం చేసింది. దీంతో.. ఈ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+