వందేమాతరం గీతం ఆలపించకుండా సోనియా గాంధీ అడ్డుకున్నారా?

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ రాజధానిలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారానికి దారితీసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ జాతీయ గేయం వందేమాతరం ఆలాపనను ఆపాల్సిందిగా అక్కడి సిబ్బందికి చేత్తో సంజ్ఞలు చేస్తోన్నట్లు కనిపించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా అదే విధమైన సైగలు చేయడం ఈ వివాదాన్ని మరింత పెంచింది.

దేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఈ ఉదయం ఖర్గే.. జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సహా పార్టీకి చెందిన సీనియర్ నాయకులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. వందేమాతరం గేయాన్ని పూర్తిగా పాడుతుండగా సోనియా గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారని బీజేపీ ఆరోపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది.

During Vande Mataram Sonia Gandhi and Kharge Reportedly Make Gestures That Appear to Stop Singing

వందేమాతరం పూర్తి వెర్షన్ ఆలపిస్తున్న సమయంలో కాంగ్రెస్ అగ్రనేతలు అసహనానికి గురైనట్లు కనిపిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ విమర్శించారు. దేశ విభజనకు ముందు ఉన్న నాటి పాత మనస్తత్వమే కాంగ్రెస్ లో ఇప్పటికీ కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కు దేశం పట్ల ఏ మాత్రం భక్తిభావం లేదని, విభజించి పాలించు దోరణిని కనపర్చుతోందని మండిపడ్డారు.

ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తోసిపుచ్చింది. ఖర్గే కోసం ఆమె ఓ కుర్చీని తీసుకుని రావాలంటూ ఆమె సిబ్బందిని కోరుతూ చేతిని ఊపారని వివరణ ఇచ్చింది. వృద్ధాప్యం కారణంగా ఖర్గే ఎక్కువ సేపు నిల్చోలేకపోయారని, ఇబ్బంది పడటాన్ని గమనించిన సోనియా గాంధీ ఆయన కూర్చోవడానికి కుర్చీని తీసుకుని రావాలంటూ అక్కడి సిబ్బందికి చేత్తో సైగలు చేశారని కాంగ్రెస్ స్పష్టం చేసింది. దీన్ని కూడా తప్పుపట్టడం బీజేపీకే చెల్లిందని మండిపడింది.

వందేమాతరం ఆలపించడాన్ని అడ్డుకునే ప్రయత్నం సోనియా, ఖర్గే, రాహుల్ గాంధీ ఏదీ చేయలేదని తేల్చి చెప్పింది. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని పేర్కొంది. తమపై బురద జల్లేందుకే ఈ తరహా తప్పుడు ప్రచారానికి బీజేపీ తెరలేపిందని ఎదురుదాడికి దిగింది. వృద్ధాప్యం కారణంగా ఖర్గే ఇబ్బందులు పడటాన్ని కూడా రాజకీయం చేయాలనుకోవడం బీజేపీ మనస్తత్వానికి అద్దం పడుతోందని విమర్శించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+