మరో వివాదంలో అల్లు అర్జున్.. వెంటనే పోస్టు డిలీట్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే 2024 డిసెంబర్ 2 న పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర వివాదం చెలరేగింది. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టులో నడుస్తోంది. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో వివాదంలో చిక్కుకున్నారు.
తాజాగా 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లు అర్జున్ తన అధికారిక ఎక్స్ మాధ్యమంలో ఓ పోస్టు పెట్టారు. అది కాస్తా ఇప్పుడు వివాదాస్పదమైంది. ఎర్రకోట మీద త్రివర్ణ పతాకం ఉండే విధంగా ఓ ఫొటోను పోస్టు చేశారు. అయితే జెండా మధ్యలో మాత్రం అశోక చక్రం కన్పించలేదు. దాంతో బాధ్యత గల ఓ వ్యక్తి జాతీయ పతాకం సరిగా ఉందో లేదో చూసుకోరా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లోగో మాత్రం మిస్ కాకుండా వేసుకున్నారని మండిపడ్డారు. దీంతో బన్నీ ఆ పోస్టును డిలీట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. ప్రస్తుతం ఆ పోస్టు కనిపించడం లేదు. అల్లు అర్జున్ పోస్టును డిలీట్ చేసిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ వైడ్ గా రూపొందుతోంది. రాకా మూవీ 2027 సెకండ్ హాఫ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కథనం ప్రకారం.. రాకా మూవీ రెండు విభిన్న ప్రపంచాల నేపథ్యంలో సాగే కథ అని తెలుస్తోంది. గిరిజన, పురాణ, వేద కాలం నాటి నేపథ్యం ఒకటి కాగా.. మరొకటి సమకాలీన ప్రస్తుత కాలానికి చెందినదిగా చెబుతున్నారు. ఈ మూవీలో దీపికా పదుకొణె, జాన్వీ కపూర్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుత కాలంలో సాగే కథలో మృణాల్ ఠాకూర్ పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాతో పాటు అల్లు అర్జున్.. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. ఇక సుకుమార్ తో పుష్ప 3 కూడా సిద్ధం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications