జిన్ పింగ్- పెంగ్ లియువాన్‌ లకు ట్రంప్ అద్దిరిపోయే డిన్నర్.. మెనూ చూస్తే వావ్ అనాల్సిందే..

అమెరికా పర్యటనలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్ బిజీగా ఉన్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం మేరీ ల్యాండ్‌ లోని జాయింట్‌ బేస్‌ ఆండ్రూస్‌ కు చేరుకున్న ఆయనకు.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘన స్వాగతం పలికారు. ఇక గురువారం ట్రంప్- జిన్‌ పింగ్ భేటీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ట్రేడ్ టారిఫ్‌ లు, మిడిల్ ఈస్ట్ యుద్ధంపై కీలక చర్చలు జరిగాయి. ఏఐ విషయంలో కఠినమైన నియంత్రణలు అవసరం లేదని, అమెరికా డిపార్ట్‌ మెంట్ ఆఫ్ జస్టిస్ చట్టాలే దాన్ని చూసుకుంటాయని ఇరు దేశాలు అభిప్రాయానికి వచ్చాయి. ఇక వైట్‌ హౌస్‌ లో షి జిన్‌పింగ్ ఆయన సతీమణి ఫస్ట్ లేడీ పెంగ్ లియువాన్‌ లకు ట్రంప్ ప్రత్యేకంగా ఘన స్వాగతం పలికి సంప్రదాయ నోరూరించే అమెరికన్- చైనీస్ వంటకాలతో అద్భుతమైన స్టేట్ డిన్నర్ ను ఏర్పాటు చేశారు.

వైట్‌ హౌస్‌ లోని ఈస్ట్ రూమ్‌ లో ఈ విందు జరగనుంది. మెనూలోని వివరాలు చూస్తే ఫస్ట్ కోర్స్ లో భాగంగా యెల్లో స్క్వాష్ వెలోట్, వైల్డ్ మష్ రూమ్స్, ఫ్రెష్ హెర్బ్స్, క్రిస్పీ పాన్ సెట్టా అలాగే డ్రిజిల్డ్ స్కాలియన్ ఆయిల్ తో ఈ ప్రత్యేకమైన వంటకాన్ని తయారు చేశారు. ఆ తర్వాత అతిథులకు సీసేమ్ క్రస్టెడ్ సీ బాస్ అనే వంటకాన్ని సర్వ్ చేయనున్నారు. దాంతోపాటు బ్రెయిజెడ్ బేబీ బోక్ చోయ్, రోస్టెడ్ గార్డెన్ ఎగ్ ప్లాంట్, సాస్ వెర్టే మెనూలో భాగంగా ఉన్నాయి. ఇక డెజర్ట్ కు వెనిల్లా క్రీమియక్స్ సోర్ చెర్రీ కాన్ ఫిట్ తో కలిపి ఇవ్వనున్నారు. అలాగే వాల్ నట్ ఫ్రాంగిపేన్ కూడా ఉండనుంది. వీటితోపాటు హనీతో చేసిన ఐస్ క్రీమ్ ను కూడా మెనూలో చేర్చారు. ఈ వంటకాలు అమెరికన్- చైనీస్ వంట సంప్రదాయాలకు మేళవింపుగా ఉండటం విశేషం.

Trump hosts dinner for Xi Jinping featuring American Chinese flavors here is the mouthwatering menu

అలాగే ఈ విందు సమయంలో సంగీత కార్యక్రమాన్ని కూడా వైట్ హౌజ్ ఏర్పాటు చేసింది. ట్రంప్ రెండోసారి అధ్యక్ష పదవికి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన ప్రముఖ టెనార్ క్రిస్టోఫర్ మాచియో ఈ కీలకమైన విందులో తన సంగీతంతో అలరించనున్నారు. అలాగే అమెరికాలోని కొన్ని పాపులర్ మ్యూజికల్ బ్యాండ్స్ కూడా ఈ వేడుకలో తమ ప్రదర్శనలు ఇవ్వనున్నట్లు వైట్ హౌజ్ పేర్కొంది. అయితే ఇటీవల బ్రిక్స్ సమావేశంలో భారత్ ఇచ్చిన విందులో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాలేదు. కానీ తాజాగా ట్రంప్ ఇస్తున్న స్టేట్ డిన్నర్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడంపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+