ఆ డైరెక్టర్‌కి అలా బుద్ధి చెప్పా.. క్యాస్టింగ్ కౌచ్‌పై జబర్దస్త్ నటి షాకింగ్ కామెంట్స్
చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టే అమ్మాయిలను అవకాశాల పేరుతో వాడుకునే కామాంధుల గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి నిత్యం ఎక్కడో ఒక చోట వార్తలు వస్తూనే ఉన్నాయి. ఎందరో హీరోయిన్లు, మహిళా నటులు తమకు ఎదురైన అనుభవాలను పంచుకుంటూనే ఉన్నారు. పైకి పెద్ద మనుషుల్లా నటిస్తూ బయట కీచకులుగా ప్రవర్తించే వారి బండారాలు కూడా బయటపడ్డాయి. ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య ఉల్లింగాల కూడా తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి బయటపెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..
మచిలీపట్నానికి చెందిన ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలోనే తొలుత యాంకర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. కొన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌కు, షాపింగ్ మాల్స్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు. 2019లో ఎరేజర్ అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. అలాగే కృష్ణా మాధురి, ఓ రైతు కథ అనే వెబ్ సిరీస్‌లలోనూ ఐశ్వర్య నటించింది. ఈ దశలో బుల్లితెరపై ఆమెకు అవకాశాలు వచ్చాయి. 2020లో స్టార్‌మాలో ప్రసారమైన చిట్టితల్లి అనే ధారావాహికలో నటించారు. అనంతరం జెమినీ టీవీలో భాగ్యరేఖ సీరియల్‌తో అలరించారు. ఈ క్రమంలోనే ఐశ్వర్యకు ఈటీవీలో జబర్దస్త్ కమెడియన్‌గా అవకాశం దక్కింది. తన అందం, పంచ్‌లతో అలరించిన ఐశ్వర్యకు మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, రిలేషన్, క్యాస్టింగ్ కౌచ్ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఐశ్వర్య.

కమిట్మెంట్ అన్నది నేరుగా ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఫోన్ కాల్స్‌లో అడిగేవారు. తొలుత నేను వెళితే కథ చెప్పేవారు.. డైరెక్టర్, ప్రొడ్యూసర్లు నేరేషన్ ఇచ్చేవారు. ఇంటికొచ్చాక కాల్స్ వచ్చేవి.. సరిగ్గా రేపు అగ్రిమెంట్ అనగా ముందు రోజు రాత్రి ఫోన్లు వచ్చేవి. నువ్వంటే క్రష్ అంట.. ఇంట్రెస్ట్ ఉందంట అని కాల్స్ వచ్చేవి. ఫస్ట్‌లో అయితే నేరుగా కూర్చొని మాట్లాడుతుండగానే అడిగారు. వాళ్లు కమిట్మెంట్ అనగానే.. నేను చాలా కమిట్మెంట్గా ఉంటాను, చాలా హార్డ్ వర్క్ చేస్తానని చెప్పేదానిని. నాకు కమిట్మెంట్ అంటే ఏంటో తెలియకపోవడం వల్ల అలా చెప్పేశానని ఐశ్వర్య వెల్లడించారు.
కాలేజీ నుంచి అప్పుడే బయటికొచ్చిన మనకి కమిట్మెంట్ అంటే ఏం తెలుస్తుంది. కమిట్మెంట్ అంటే ఇలా ఉంటుందని తర్వాత చెబితే అక్కడే ఓ డైరెక్టర్ని కొట్టి బయటికి వచ్చేశా, ఆ డైరెక్టర్ ఎవరన్నది నేను చెప్పను. నాకు ఛాన్స్‌లు ఇవ్వమని నేను ఏ డైరెక్టర్ దగ్గరికి వెళ్లను.. నా నటన, నన్ను చూసి కొంతమంది సంప్రదిస్తారు. కంటిన్యూగా సీరియల్స్, టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు, సినిమాలు చేస్తున్నా కరెక్ట్ బ్రేక్ రాలేదు. స్టోరీ చెప్పడం బాగా చెబుతారు.. కానీ తీశాక ఎలా ఉంటుంది అనేది మన చేతిలో లేదు. నన్ను సరిగా వాడుకోలేదని అనుకుంటున్నానని ఐశ్వర్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications
