Child marriage: 3 ఏళ్ల చిన్నారికి 60 ఏళ్ల వ్యక్తితో వివాహం.. మీరు మారరా..??
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముడి చమురు, గ్యాస్ రవాణా కొరవడి ప్రపంచ దేశాలు సంక్షోభంలో ఉన్నాయి. ఇక అసలే ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రం ఉన్న పాకిస్థాన్ లో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వీటికితోడు అక్కడ కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు ఇప్పటికీ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పాకిస్థాన్ లోని సౌత్ వెస్ట్ ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్ లో అభంశుభం తెలియని 3 ఏళ్ల చిన్నారిని 60 ఏళ్ల వృద్ధుడికిచ్చి వివాహం చేసినట్లు సమాచారం. 2.5 మిలియన్ పాకిస్థానీ రూపాయల కోసం చిన్నారి తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్లు స్పష్టం అవుతోంది. బలూచిస్థాన్ లోని సంప్రదాయ వాల్వార్ పద్ధతిలో భాగంగా ఈ ఘటన జరిగినట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ షాకింగ్ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో చమన్ పోలీసులు స్పందించి చిన్నారి తండ్రి అబ్దుల్ బాఖీని అరెస్ట్ చేశారు.
అలాగే మూడేళ్ల చిన్నారిని పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల వ్యక్తి సలా ఉద్దిన్ గా గుర్తించారు. ఇక వాల్వార్ అనేది పాష్తో టర్మ్.. ఈ సంప్రదాయం ప్రకారం వరుడు కొంత ధనాన్ని వధువు తల్లిదండ్రులకు ఇచ్చి ఆమెను వివాహం చేసుకుంటాడు. అయితే ఈ వివాహ తంతు ఇంకా పూర్తిగా ముగియకముందే పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిందితులను అరెస్ట్ చేశారు. ఈ సంప్రదాయంలో మొదటగా ఇరు వర్గాల వాళ్లు సంబంధిత పేపర్లపైన సంతకాలు చేయాలి. అంతమాత్రాన చిన్నారి ఆ వ్యక్తితో కలిసి జీవించడం అనేది ఉండదు. అయితే చెల్లింపుల్లో జాప్యం జరిగితే ఆ ఒప్పందానికి చిన్నారి ఏళ్ల తరబడి కట్టుబడి ఉండాలి. ఒకవేళ బాలిక మేజర్ అయ్యాక వేరే వ్యక్తితో వివాహం జరిగితే ఇరు కుటుంబాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీస్తుంది.

ఇక ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నేపథ్యంలో బలూచిస్థాన్ సీఎం మీర్ సర్ఫరాజ్ బుగాటీ ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. అటు పోలీసులు కూడా ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగానే వెంటనే స్పందించారు. ఫిర్యాదు వచ్చేంత వరకూ వేచి చూడలేదని తెలుస్తోంది. ఈ కేసులో బాలిక తండ్రిని అరెస్ట్ చేశామని పోలీస్ అధికారి అహ్మద్ ఉమ్రానీ తెలిపారు. అయితే వరుడుగా ఉన్న 60 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఇక తాము బాల్య వివాహాలను ఏమాత్రం సపోర్ట్ చేయమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications
