'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!'
వివాదాస్పద కామెంట్లు, పోస్టులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు ప్రముఖ నటి కస్తూరి శంకర్. మనసులో ఉన్నది దాసుకోకుండా మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా పలుమార్లు వివాగాల్లో కూడా చిక్కుకున్నారు. కొద్దిరోజుల క్రితం తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకు కూడా వెళ్లొచ్చారు. తాజాగా నటి కస్తూరి శంకర్ ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత అలవాట్లు, వివాదాల గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
1991లో 'ఆతా ఉన్ కోయిలే' సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన నటి కస్తూరి.. మూడున్నర దశాబ్దాల కెరీర్‌లో వందకు పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. పెళ్లి, పిల్లల కోసం సినిమాలకు విరామం ప్రకటించిన ఆమె.. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, టీవీ నటిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఆమె సామాజిక కార్యకర్తగా, లాయర్‌గా కూడా మహిళా హక్కుల కోసం పోరాడుతున్నారు.

తెలుగువారిపై అనుచిత కామెంట్స్
ఇటీవల కాలంలో తెలుగువారిపై చేసిన వివాదాస్పద కామెంట్ల గురించి ఆమె స్పందించారు. తన మాటలను వక్రీకరించి, వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని కస్తూరి ఆరోపించారు. తాను ద్రవిడియన్ రాజకీయాల గురించి.. వాటి మూలాల గురించి మాత్రమే చర్చించానని.. కానీ తనపై కక్షగట్టిన కొందరు కావాలనే ఆ అంశాన్ని తప్పుదారి పట్టించారని పేర్కొన్నారు. ఈ వివాదం కారణంగా ఆమె జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.
రాత్రి 9 గంటల వ్యసనం.. అసలు విషయం ఇదే..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తనకున్న ఓ విచిత్రమైన వ్యసనం గురించి కస్తూరి సరదాగా వెల్లడించారు. రాత్రి 9 గంటలు దాటితే తనలో ఓ కోరిక మొదలవుతుందని.. దానికి లొంగిపోకుండా ఎంత కంట్రోల్ చేసుకున్నా సాధ్యం కాదని కస్తూరి చెప్పుకొచ్చారు. అయితే ఆ వ్యసనం మరేదో కాదు 'బంగాళదుంప చిప్స్' అని యాంకర్ బయటపెట్టారు. అది తిన్న ప్రతిసారీ మరుసటి రోజు ఉదయం తాను చాలా బాధపడతానని, ఇక వీటిని ముట్టుకోకూడదని నిర్ణయించుకుంటానని ఆమె నవ్వుతూ వెల్లడించారు.
చిప్స్‌కు బానిసవ్వడానికి కారణం
ఈ చిప్స్ అలవాటు వెనుక ఓ ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. గతంలో పర్సనల్ కారణాల వల్ల పదేళ్ల పాటు చిప్స్‌కు దూరంగా ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం వాటి రుచికి పూర్తిగా బానిసనైపోయానని.. ఎన్ని చిప్స్ పెట్టినా ఖాళీ చేసే స్థాయికి చేరుకున్నానని కస్తూరి తనదైన శైలిలో సరదాగా వివరించారు.












Click it and Unblock the Notifications