'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ తో పాటుగా మిగతా స్టార్ కాస్ట్, నిర్మాతలు హాజరయ్యారు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ భారీగా ఈ వేడుకకు తరలివచ్చారు. ఈ ప్రీ- రిలీజ్ వేడుకకు యాంకర్ సుమ హోస్ట్ గా ఉన్నారు.
అయితే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా సుమ స్టేజీ మీద నుంచి కిందకు దిగి అక్కడ ఉన్న ప్రొడ్యూసర్ మైత్రి శశి ని కొన్ని ప్రశ్నలు అడిగారు. నాకు తెలిసి మీరు సినిమా చూసే ఉంటారు.. ఈ పాటికి.. మీరు ఏమైనా ఆడియన్స్ కు లీక్ ఇస్తారా..? అని అడగ్గా.. దానికి మైత్రి శశి మాట్లాడుతూ.. నాకు సినిమా ఇంకా చూపించలేదు. నేను కూడా ప్రేక్షకులతో ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని అనుకుంటున్నాను. గబ్బర్ సింగ్ కూడా అలాగే చూశాను. ఆ అనుభూతి ఇంకా ఉంది.. అని అన్నారు. అప్పుడు ఉదయం 4 గంటలకు గబ్బర్ సింగ్ ప్రీమియర్ చూసినట్లు తెలిపారు. ఇప్పటికే ఆంధ్రాలో బెనిఫిట్ షో కు అనుమతి ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నాం.. అని అన్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షో టైమ్ లీక్ చేసిన 'మైత్రీ' శశి#Ustaad pic.twitter.com/m7ZWr4A1Ug
— Telugu360 (@Telugu360) March 15, 2026
ఇక తెలంగాణలోనూ ప్రీమియర్ షో స్ ఉన్నట్లు మైత్రి శశి మాటలను బట్టి తెలుస్తోంది. దాంతో నైజాంలోని పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఇక ఇప్పటికే 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ ట్రైలర్ రిలీజైన విషయం తెలిసిందే. ట్రైలర్ లో డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇచ్చిపడేసే గోత్రం.. ఇరగదీసే నక్షత్రం.. అంటూ పవన్ కల్యాణ్ చెప్పే డైలాగ్స్ ట్రైలర్ కే హైలెట్ గా నిలిచాయి.

ఇక పవన్ కల్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత ఇద్దరి కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ మూవీ ఉగాది కానుకగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమైంది.












Click it and Unblock the Notifications