గోంగూర టమాటా శనగపప్పు కూర... ఇలా వండితే అన్నం మెతుకు మిగలదు!

నోటికి మంచి రుచి కావాలంటే పుల్ల పుల్లగా ఉండే గోంగూర, టమాటా, శనగపప్పు కూర వండుకు తింటే బాగుంటుంది. గోంగూర, టమాటా, శనగపప్పు కలిపి చేసే కూర ఆంధ్ర వంటల్లో చాలా ప్రాచుర్యం పొందినది. ఈ కూర వేడి వేడి అన్నంలో బాగా సరిపోతుంది. ఈ కూరను చేయడం చాలా సులభం. చాలా ఈజీగా కుక్కర్ లో ఈ కూరను తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

గోంగూర ఆకులు - 2 కట్టలు (శుభ్రంగా తెంచినవి)
టమాటాలు - 2 నుంచి 3 (మధ్యస్థం)
శనగపప్పు - ½ కప్పు (2 గంటలు నానబెట్టి)
ఉల్లిపాయలు - 1 పెద్దది
పచ్చిమిర్చి - 3 నుంచి 4
వెల్లుల్లి రెబ్బలు - 15
ఇంగువ - చిటికెడు
ఆవాలు, జీలకర్ర, కరివేపాకు - తగినంత
ఎండు మిరపకాయలు - 2
ఉప్పు, కారం, పసుపు - రుచికి తగ్గట్టు
నూనె - 3 టేబుల్ స్పూన్లు

Gongura Tomato Senagapappu pulusu kura Recipe know how to make this in Authentic Andhra Style

తయారీ విధానం:

స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ పెట్టి అందులో గోంగూర, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయలు అన్నీ ముక్కలుగా కట్ చేసినవి మరియు శనగపప్పు వేసి మూడు విజిల్స్ వచ్చే దాకా ఉడికించాలి. ఆ తర్వాత కుక్కర్ విజిల్ వదిలాక కొద్దిగా పసుపు, స్పూనున్నర ఉప్పు, 2 స్పూన్ల కారం వేసి అంతా కలిపి మాష్ చెయ్యాలి. ఆపై అందులో పోపు చేసుకోవాలి.

క్రిస్పీ కార్న్ ఇలా చేస్తే బాగుంటుంది.. కార్న్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
క్రిస్పీ కార్న్ ఇలా చేస్తే బాగుంటుంది.. కార్న్ ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

ఇలా చేస్తే సూపర్ టేస్టీ గోంగూర, టమాటా, శనగపప్పు పులుసు కూర

పోపు కోసం స్టవ్ వెలిగించి 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో ఎండు మిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, పోపు గింజలు, కరివేపాకు వేసి పోపు చేసుకోవాలి. ఆ తర్వాత ఆ పోపును వండుకున్న పులుసు కూరలో కలిపి మళ్ళీ కొద్దిసేపు ఉడికించాలి. అంతే రుచికరమైన గోంగూర, టమాటా, శనగపప్పు పులుసు కూర రెడీ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం కుక్కర్ లో చాలా సులభంగా తయారు చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చెయ్యండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+