గర్భవతి అయిన లవర్ ను చంపి గోనెసంచిలో కుక్కి.. హైదరాబాద్ లో అమానవీయం!

రోజురోజుకీ సమాజంలో దారుణాలు పెరిగిపోయాయి. సినిమాలలో క్రైం సీన్లు చూసీ, చూసీ అలవాటు పడుతున్న జనాలు క్రైమ్స్ ను చాలా సునాయాసంగా చేసేస్తున్నారు. ప్రేమ పేరుతో అమ్మాయిలను వాడుకోవటం, ఆపై పరలోకాలకు పంపించటం వంటి ఘటనలు కూడా ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్నాయి.

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి హత్య కేసు

తాజాగా హైదరాబాద్‌లోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక యువతి హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 21 ఏళ్ల రహీన అనే యువతి బీహార్‌కు చెందినది. ఆమె పహాడీషరీఫ్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో నివసిస్తూ స్థానిక ఫంక్షన్ హాల్‌లో పనిచేస్తోంది. అదే చోట పనిచేస్తున్న బాలాపూర్‌కు చెందిన అహ్మద్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.

Lover murder 21-year-old woman murdered in Hyderabad s Balapur Accused lover and his parents arrested

ప్రియురాలిని చంపి గొనె సంచిలో కుక్కి తరలించే యత్నం

ఇటీవల రహీన గర్భవతి అయింది. ఈ విషయాన్ని ప్రియుడికి చెప్పి వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో అహ్మద్, అతని తల్లిదండ్రులు కలిసి ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటన అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో ఉంచి రహస్యంగా తరలించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అర్థరాత్రి సమయంలో వారి కదలికలపై అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

హత్య చేసిన ప్రియుడు, ప్రియుడి తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన పోలీసులు

సమాచారం అందుకున్న బాలాపూర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అహ్మద్, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేపై లేటెస్ట్ అప్డేట్!
మంచిర్యాల–వరంగల్ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవేపై లేటెస్ట్ అప్డేట్!

ఏకంగా ప్రాణమే తీయటంతో షాక్

ప్రేమ పేరుతో మొదట అమ్మాయిని లోబరుచుకుని, గర్భవతి అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఆ యువతీ ఒత్తిడి తెస్తే ఏకంగా ప్రాణమే తీయటం అందరినీ షాక్ కు గురి చేసింది. అమ్మాయిని అడ్డు తొలగించుకోవటం, దానికి అతని తల్లిదండ్రులు కూడా సహకరించటం స్థానికుల్లో షాక్ కలిగించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+