'ఆయా షేర్' పాటకు స్టెప్పులేసిన సీపీ సజ్జనార్.. వీడియో వైరల్
హైదరాబాద్ తో పాటు తెలంగాణలో గణేష్ నిమజ్జనం కార్యక్రమం ముగిసింది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత నడుమ గణేశ్ నిమజ్జనం సాఫీగా సాగింది. వినాయక శోభయాత్ర దిగ్విజయంగా ముగియడంతో పోలీసులు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ క్రమంలో ఇవాళ మధ్యాహ్నం సమయానికి చివరి గణపతి గంగమ్మ ఒడికి చేరిన తరువాత పోలీసులు సంతోషంతో డ్యాన్స్ చేశారు. అక్కడే ఉన్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనర్ కూడా వారితో కలిసిపోయారు. ఇటీవల రిలీజ్ అయిన నేచురల్ స్టార్ నాని 'ది ప్యారడైజ్' సినిమాలోని 'ఆయా షేర్' పాటకు స్టెప్పులు వేసి అక్కడున్న పోలీసుల్లో జోష్ నింపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీపీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిమజ్జనానికి సహకరించిన సిబ్బంది, భక్తులకు ధన్యవాదాలు తెలిపారు. గణేశ్ నిమజ్జనాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహకరించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిమజ్జన కార్యక్రమాలు జరిగాయని.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు నిమజ్జనంలో పాల్గొన్నారని వివరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిమజ్జనాలను పూర్తిచేశామని తెలిపారు. ఖైరతాబాద్ వినాయక నిమజ్జనానికి 30 లక్షల మంది హాజరయ్యారని..
@CPHydCity @SajjanarVC_IPS grooves to ‘Paradise Aaya Sher’ song!@hydcitypolice Commissioner V.C. Sajjanar joined the #GaneshImmersion festivities and surprised the crowd with his energetic #dance moves to the popular ‘Paradise Aaya Sher’ song.#Sajjanar @TelanganaCOPs… pic.twitter.com/FswnQvIxIA
— NewsMeter (@NewsMeter_In) September 26, 2026
అలాగే బాలాపూర్ గణేశ్ నిమజ్జనానికి 15 లక్షల మంది హాజరైనట్లు తెలిపారు. నిమజ్జనానికి బయటనుంచి ఉన్నత అధికారులు కూడా వచ్చినట్లు సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. ఇక నిమజ్జనంలో ఈసారి పేపర్ షాట్ మిషన్లను ఎక్కువగా వాడారని తెలిపారు. మరోవైపు వినాయక నిమజ్జనం వేళ రాజకీయ పార్టీల పాటలు పెట్టొద్దని తాను చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. ప్యాంట్, షర్ట్ విప్పి అసభ్యకరంగా డ్యాన్స్ చేస్తే.. చర్యలు తీసుకుంటామని చెప్పామని వెల్లడించారు. ఇక ప్రణాళికాబద్ధంగా అన్ని శాఖల సమన్వయంతో అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారని.. నగరవ్యాప్తంగా 2 లక్షలకుపైగా విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరగా ఒక్క ట్యాంక్ బండ్ లోనే దాదాపు లక్ష ప్రతిమలు నిమజ్జనమైనట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
