Prabhas Marriage: మ్యారేజ్ పై ప్రభాస్ సంచలన అప్డేట్.. ఎక్కడున్నావ్ డార్లింగే అంటూ.. సోషల్ మీడియా షేక్..
టాలీవుడ్ లోనే కాదు మొత్తం పాన్ ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే టక్కున ప్రభాస్ అని చెప్పేస్తారు. హీరోల అందరి పెళ్లిళ్లు అవుతున్నా ప్రభాస్ పెళ్లి మాత్రం వాయిదాలు పడుతూ వస్తూనే ఉంది. ఈ ఏడాది.. వచ్చే ఏడాది.. ఇలా ప్రతి ఏడాది ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడు అని కోట్లాది మంది అభిమానులు ఆశలు పెట్టుకుంటున్నారు. అయితే తాజాగా వీటన్నింటికీ తెర దించుతూ ప్రభాస్ తన మ్యారేజ్ పై సంచలన అప్టేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది సేపటి క్రితమే తన అధికారిక ఇన్ స్టాలో పెళ్లిపై ప్రభాస్ ఓ కీలక అప్డేట్ ఇచ్చారు. దాంతో ఆ పోస్టు క్షణాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పోస్టు చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
ప్రభాస్ తన ఇన్ స్టా పోస్టులో.." నేను ఈ రోజు కొంచెం రోమియోగా ఫీల్ అవుతున్నాను. మై జూలియట్ డార్లింగే ఎక్కడున్నావ్ అంటూనే చివరికి రెడ్ కలర్ హార్ట్ సింబర్ పెట్టారు" దాంతో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఈ ట్వీట్ ఎవరి కోసం చేశారు ప్రభాస్.. డార్లింగే అన్నాడు కాబట్టి కచ్చితంగా అనుష్క కోసమేనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఏదో సినిమా ప్రొమోషన్ కోసం ఇలా పోస్టు పెట్టారని మరికొందరు మాట్లాడుకుంటున్నారు. ఇక ప్రభాస్ ఇన్ స్టా స్టోరీ ఏమైనా హ్యాక్ అయిందా అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ నుంచి ఇలాంటి పోస్టు రావడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలతోపాటు ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ ను నింపింది.

ఇక ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు. హనురాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేస్తున్నారు ప్రభాస్. ఇవే కాక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ 2 చేయాల్సి ఉంది. మరోవైపు నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కల్కి 2 చిత్రం కూడా ప్రభాస్ చేయాలి. కల్కి 2 షూటింగ్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications
