ఇరాన్ కు బిగ్ షాక్ ఇచ్చిన ట్రంప్.. ఆ ప్రొపోజల్ రిజెక్ట్.. మరోసారి దాడులు చేస్తామంటూ..!

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై సందిగ్ధం అలాగే నెలకొని ఉంది. ఈ క్రమంలో ఇరాన్ ప్రతిపాదించిన హార్మూజ్ జలసంధిని మరో వారం రోజుల్లో ఓపెన్ చేసే విషయంపై అలాగే ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాజాగా ట్రంప్ తిరస్కరించారు. ఈ మేరకు ఈ విషయాన్ని అంతర్జాతీయ ప్రముఖ దినపత్రిక ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ నివేదికలో స్పష్టం చేసింది. మేరిటైమ్ ప్యాసేజ్ ను రీస్టోర్ చేసి హార్మూజ్ జలసంధిపై ఆంక్షలను ఎత్తి వేయాలని ప్రతిపాదించిన ఇరాన్ ప్రొపొజల్ ను ట్రంప్ తిరస్కరించడంతో ప్రస్తుతం ఇరు దేశాల మధ్య మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇక హార్మూజ్ జలసంధి ప్రపంచ దేశాల వాణిజ్యానికి కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రపంచ చమురు సరఫరాకు సంబంధించి హార్మూజ్ జలసంధి ప్రస్తుతం ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా ప్రతిష్టంభనకు గురైన సంగతి తెలిసిందే. గత ఏడు నెలలుగా హార్మూజ్ జలసంధి సందిగ్ధంలోనే ఉంది.

" నేను ఇరాన్ ప్రొపోజల్ ను రిజెక్ట్ చేశాను" అని ట్రంప్ వైట్ హౌజ్ వద్ద ఉన్న రిపోర్టర్‌లకు వెల్లడించినట్లు సమాచారం. హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ఇరాన్ బాగా నష్టపోతుంది. అందుకే తక్షణమే ఈ జలసంధిని ఓపెన్ చేయాలని ఇరాన్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రొపోజల్ ను పంపింది.. అని ట్రంప్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక నవంబర్ లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఇరాన్‌ పై మరోసారి భారీగా దాడులతో విరుచుకుపడే అవకాశం ఉందని ట్రంప్ తన సహాయకులతో చెప్పినట్లు అమెరికా అధికారుల వివరాలను తెలుపుతూ వాల్ స్ట్రీట్ జర్నల్ కీలక నివేదికలో వెల్లడించింది.

Trump iran news deals a major blow to Iran rejects the proposal and threatens further attacks

మరోవైపు ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల హార్మూజ్ జలసంధి ప్రొపోజల్ ను ట్రంప్ రిజెక్ట్ చేసిన తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రొపోజల్ ను అమెరికా యాక్సెప్ట్ చేస్తే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని అన్నారు. న్యూయార్క్ లో జరిగిన 81 వ యూనైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన టెహ్రాన్ కు బయల్దేరారు. యూఎన్జీఏ కార్యక్రమంలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు స్విట్జర్లాండ్, ఇరాక్, బంగ్లాదేశ్, నార్వే, ఆర్మేనియా, ది నెథర్లాండ్స్, లెబనాన్, పాకిస్థాన్ దేశాల అధినేతలతో సమావేశం అయ్యారు. అలాగే యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు, యూఎన్ సెక్రటరీ జనరల్ తోనూ భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+