ఈసీ ప్రకటనపై చంద్రబాబు కీలక ట్వీట్- జగన్ కు భిన్నంగా అనూహ్య స్టాండ్..!

కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని, మిగతా కమిషనర్లు సంధు, వివేక్ జోషీలను పరిగణనలోకి తీసుకోవట్లేదని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈసీ వివరణ ఇవ్వాలంటూ టీడీపీ ఇవాళ కోరింది. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ మేరకు ఈసీ విభేదాల్ని తెరపైకి తెచ్చిన ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు. అనంతరం ఈసీ కమిషనర్లు ఓ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. దీనిపై సీఎం చంద్రబాబు (Chandrababu) స్పందించారు.

కేంద్రానికి జగన్ బిగ్ షాక్ - ఆ చట్టం వెనక్కి- ఈసీ వివాదంపై సంచలన డిమాండ్స్ ...!
కేంద్రానికి జగన్ బిగ్ షాక్ - ఆ చట్టం వెనక్కి- ఈసీ వివాదంపై సంచలన డిమాండ్స్ ...!

ఈసీ ప్రకటనపై ఎక్స్ వేదికగా చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇందులో ఆయన స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పై ఎన్నికల కమిషనర్లు ఏకగ్రీవంగా చేసిన ప్రకటన అపోహలకు ముగింపు పలికిందని తెలిపారు. ఉమ్మడి ప్రకటన ఈసీ విశ్వసనీయతను స్పష్టం చేసిందని పేర్కొన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు ఎస్. ఎస్. సంధూ, వివేక్ జోషి కలిసి ఏకగ్రీవంగా ఇచ్చిన వివరణ మన రాజ్యాంగ సంస్థల సమగ్రతను, విశ్వసనీయతను మరోసారి స్పష్టం చేసిందని సీఎం వ్యాఖ్యానించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ అంశంపై నెలకొన్న అపోహలకు ఇది తెరదించిందన్నారు.

nda ally Chandrababu extends support to cec gyanesh kumar after ec statement
సీఈసీని తక్షణం తొలగించండి..! కేంద్రానికి వైసీపీ సంచలన డిమాండ్ ..! ఇక పోరాటమే..!
సీఈసీని తక్షణం తొలగించండి..! కేంద్రానికి వైసీపీ సంచలన డిమాండ్ ..! ఇక పోరాటమే..!

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు సమష్టిగా, సంస్థాగత విధివిధానాలను కచ్చితంగా పాటిస్తూ తీసుకుంటారని చంద్రబాబు తెలిపారు. స్వల్పకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎన్నికల ప్రక్రియలపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు దురదృష్టకరమని తెలిపారు. ఎన్నికల ఫలితాలు ప్రజల తీర్పును ప్రతిబింబిస్తాయని, బలమైన ప్రజాస్వామ్యంలో గెలుపును, ఓటమిని సమానంగా, హుందాతనంతో స్వీకరించడం కూడా నాయకత్వ లక్షణమే అని పేర్కొన్నారు. మన రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యమన్నారు. భారత ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యత అని చంద్రబాబు తేల్చిచెప్పేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+