ఈసీ వివాదంలో ఎన్డీయే మిత్రుల షాకులు- వైఎస్సార్సీపీ బాటలో టీడీపీ, మరో 2 పార్టీలు..!

కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ (CEC) జ్ఞానేష్ కుమార్ , తోటి కమిషనర్ల ఆమోదం లేకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించిన కథనం తర్వాత దేశవ్యాప్తంగా విపక్షాలన్నీ స్పందించాయి. కానీ ఏపీలో ఎన్డీయే పక్షాలైన టీడీపీ, జనసేనతో పాటు విపక్ష వైఎస్సార్సీపీ కూడా ఎప్పటిలాగే మౌనంగా ఉన్నాయి. విపక్షాలన్నీ సీఈసీ రాజీనామా డిమాండ్ చేస్తున్నా, అరెస్టు చేయాలని కోరుతున్నా, అభిశంసన తీర్మానం పెడతామని బెదిరిస్తున్నా ఈ పార్టీలు స్పందించలేదు. దీంతో ఎన్డీయేకు అధికార, అనధికార మిత్రపక్షాలైన టీడీపీ, వైసీపీ, జనసేన గురించి చర్చ మొదలైంది.

CEC జ్ఞానేష్ పై వేటు ? న్యాయశాఖకు కమిషనర్ల లేఖలు..!
CEC జ్ఞానేష్ పై వేటు ? న్యాయశాఖకు కమిషనర్ల లేఖలు..!

ఈ నేపథ్యంలో ముందుగా స్పందించిన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కేంద్రంతో పాటు ఎన్నికల సంఘంపైనా గురిపెట్టారు. గతంలో ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం కేంద్రం తెచ్చిన సవరణ చట్టాన్ని, తాజా పరిస్దితుల నేపథ్యంలో మళ్లీ సమీక్షించాలని కేంద్రానికి డిమాండ్ చేశారు. అలాగే కేంద్ర ఎన్నికల సంఘంలో పారదర్శకత అవసరమని తెలిపారు. ఇప్పటికే ఈసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఏపీలో స్ధానిక ఎన్నికల నేపథ్యంలో గతంలో జరిగిన పలు ఘటనల్ని గుర్తుచేశారు. దీంతో ఇన్నాళ్లూ ప్రధాని మోడీకి, కేంద్రానికి పలు బిల్లుల విషయంలో అండగా నిలిచిన వైఎస్సార్సీపీ ఈసారి మాత్రం కేంద్రానికి షాకిచ్చినట్లయింది.

CEC Row After YSRCP NDA Allies TDP LJP and RLM Seek Clarification From EC
షాకింగ్ ..! ఈసీ, సీఈసీ కుమార్తె కేసుల్లో సుప్రీం జడ్జి తీర్పులు- ఈసీ లాయర్ గా కొడుకు..!
షాకింగ్ ..! ఈసీ, సీఈసీ కుమార్తె కేసుల్లో సుప్రీం జడ్జి తీర్పులు- ఈసీ లాయర్ గా కొడుకు..!

దీంతో పరిస్దితి గ్రహించిన అధికార టీడీపీ కూడా అదే బాట పట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో 'ఎస్‌ఐఆర్' (SIR) ప్రక్రియ "పారదర్శకమైన పద్ధతిలో జరిగిందంటూనే టీడీపీ లోక్‌సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు .. అదే సమయంలో భారత ఎన్నికల సంఘం అనేది మన ప్రజాస్వామ్యంలో కీలక బాధ్యత కలిగిన ఒక రాజ్యాంగబద్ధ సంస్థ కాబట్టి, ఎవరైనా ప్రశ్నలు లేవనెత్తినప్పుడు, తగిన వివరణ ఇవ్వడం, పారదర్శకతను పాటించడం వల్ల ఆ సంస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం మరింత బలపడుతుందని తెలిపారు. తద్వారా ఈ వివాదంపై ఈసీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

CEC Row After YSRCP NDA Allies TDP LJP and RLM Seek Clarification From EC
ఢిల్లీ నుంచే ఈసీ ఓట్ల చోరీ ? రాష్ట్రాల్లో ఏమీ లేదా ? సుప్రీం ఆర్డర్ బేఖాతర్- మరో బిగ్ బాంబ్..!
ఢిల్లీ నుంచే ఈసీ ఓట్ల చోరీ ? రాష్ట్రాల్లో ఏమీ లేదా ? సుప్రీం ఆర్డర్ బేఖాతర్- మరో బిగ్ బాంబ్..!

అలాగే ఎన్డీయేలో మరో రెండు మిత్రపక్షాలు లోక్ జన్ శక్తి (ఎల్జేపీ పాశ్వాన్), రాష్ట్రీయ లోక్ మోర్చా (ఆర్ఎల్ఎమ్) కూడా స్పందించాయి. లోక్ జన్ శక్తి నేత, కేంద్రమంత్రి చిరాగ్ పాశ్వాన్ స్వతంత్ర సంస్ధ అయిన ఎన్నికల కమిషన్ పై ఆరోపణలు వచ్చినప్పుడు సీఈసీ స్పందించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజలు ఈసీ పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేయడం ప్రారంభిస్తే సమస్యాత్మకం అవుతుందన్నారు. కాబట్టి రాహుల్ గాంధీకి కాకపోయినా ప్రజలకు ఈసీ సమాధానం చెప్పాలన్నారు. అలాగే ఎన్డీయే మరో మిత్రపక్షం ఆర్ఎల్ఎమ్ నేత ఉపేంద్ర కుశ్వాహా .. ఇప్పటివరకు జరిగిన పరిణామాలను బట్టి చూస్తే ఈసీ పనితీరులో కచ్చితంగా ఏదో సమస్య ఉందని స్పష్టమవుతోందన్నారు. ఎన్నికల సంఘం తన వైఖరిని స్పష్టం చేయాలని, అలాగే ఈసీపై తలెత్తిన ప్రశ్నలు, వ్యక్తమవుతున్న ఆందోళనలపై వివరణ ఇవ్వాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+