నితీష్ కాదు.. మరెవరో? ఎన్డీయేలో సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ! బీజేపీ ప్లాన్ ఏంటి?

Bihar Election 2025: దాదాపు రెండు దశాబ్దాలుగా బీహార్ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా ఉన్న, అత్యధిక కాలం సీఎంగా పని చేసిన నితీష్ కుమార్ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా మారాయి. ఈ ఎన్నికల్లో ఆయన తిరిగి సీఎం పీఠాన్ని అధిరోహిస్తారా లేదా అనేదానిపై అనిశ్చితి నెలకొనడంతో ఆయనకు ఈ సవాలు కష్టంగా మారింది. ఇటీవల 74 ఏళ్ల నితీష్ ఆరోగ్యంపై ప్రతిపక్షాల నుంచి విమర్శల నేపథ్యంలో ఆయనకు మరో అవకాశం మిగిలి ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఈ రాజకీయ డ్రామాకు మరింత ఆజ్యం పోశాయి.

అమిత్ షా వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటి?
ఓ టీవీ షోలో అమిత్ షా మాట్లాడుతూ.. "నితీష్ జీ మా ఎన్నికల ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. అయితే కూటమి భాగస్వాముల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు మొదట వారి వారి పార్టీ నాయకులను ఎన్నుకుంటారు. ఆ తర్వాత వారంతా కూర్చుని తదుపరి ప్రభుత్వానికి ఎవరు నాయకత్వం వహించాలో నిర్ణయిస్తారు" అని అన్నారు. ఈ క్రమంలో అమిత్ షా వ్యాఖ్యలపై ప్రతిపక్షం వెంటనే కౌంటర్ ఇచ్చింది. నితీష్ కుమార్‌ను తదుపరి సీఎం అభ్యర్థిగా బీజేపీ పరిగణించడం లేదని వారు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌(గతంలో ట్విట్టర్) హ్యాండిల్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేస్తూ.. "నితీష్ ముఖ్యమంత్రి కారు, అమిత్ షా స్పష్టం చేశారు" అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే బీజేపీ వెంటనే పూర్తి క్లిప్‌ను పంచుకుని, ఈ ప్రచారాన్ని ఖండించింది. అమిత్ షా ప్రకటనను వక్రీకరిస్తున్నారని, ఇది ప్రతిపక్షాల రాజకీయ ఎజెండా మాత్రమేనని పేర్కొంది.

Bihar Elections 2025 NDA Faces Uncertainty Over CM Face Is Nitish Out

ఎన్డీయే మిత్రపక్షాల ప్రతిస్పందన
చిరాగ్ పాశ్వాన్ మద్దతు: బీజేపీ కీలక మిత్రపక్షమైన ఎల్జేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ అమిత్ షా ప్రకటనకు మద్దతు ఇచ్చారు. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిని ఎన్నుకునే సాధారణ ప్రక్రియ గురించి మాత్రమే అమిత్ షా ప్రస్తావించారని, ఈ ప్రక్రియను గౌరవించాలని అన్నారు.

మాంఝీ డిమాండ్: హిందుస్తాన్ అవామ్ మోర్చా అధినేత, కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ కూటమిలో స్పష్టత, ఐక్యత కోసం ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని ఎన్డీయేను కోరారు.

కుష్వాహా ఖండన: అయితే రాష్ట్రీయ లోక్‌మంచ్ (RLM) జాతీయ అధ్యక్షుడు ఉపేంద్ర కుష్వాహా మాత్రం నితీష్ కుమార్ రాబోయే 2025 అసెంబ్లీ ఎన్నికలకు ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారని దృఢంగా చెప్పారు. "మేము ఎన్నికల్లో విజయం సాధిస్తాం. ఆయన నాయకత్వంలోనే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుంది." అని ఆయన తెలిపారు.

ప్రశాంత్ కిషోర్ అంచనా నిజమవుతుందా?
జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ గతంలోనే నితీష్ కుమార్ మళ్లీ ముఖ్యమంత్రి కాలేరని బహిరంగంగా చెప్పారు. నితీష్ నేతృత్వంలోని జేడీయూ 243 అసెంబ్లీ స్థానాల్లో 25 సీట్లు గెలవడం కూడా కష్టమవుతుందని అంచనా వేశారు. సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్‌ను "శారీరకంగా అలసిపోయారు, మానసికంగా రిటైర్ అయ్యారు" అని విమర్శించారు. నితీష్ కుమార్ పార్టీ తన సాంప్రదాయ ఓటు బ్యాంకును కోల్పోతుందని ప్రశాంత్ కిషోర్ గట్టిగా నమ్ముతున్నారు.

బీహార్‌లో అత్యంత ఉత్కంఠగా మారిన ఈ ఎన్నికల్లో, నాయకత్వం, కూటమి ఐక్యత గురించిన ప్రశ్నలు రాజకీయ చర్చలను డామినేట్ చేస్తున్నాయి. నితీష్ కుమార్ ప్రస్తుతానికి ఎన్డీయే ముఖంగా ఉన్నప్పటికీ.. అమిత్ షా జాగ్రత్తగా మాట్లాడిన విధానం, మిత్రపక్షాల స్పందనలను బట్టి చూస్తే, తుది నిర్ణయం ఎన్నికల తర్వాత వచ్చే సంఖ్యా బలంపైనే ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. ఏది ఏమైనా బీహార్ రాజకీయ రంగం మరో నాటకీయ అధ్యాయానికి సిద్ధంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+