రోడ్డుపై గుంత కనిపించిందో ఇక అంతే! ప్రభుత్వానికి షాక్ ఇచ్చేలా సూపర్ ఏఐ యాప్
బెంగళూరు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐటీ ప్రాజెక్టులు, ట్రాఫిక్ సమస్యలు, అంతకుమించి ప్రాణాలను పిండేసే గుంతల రోడ్లు. రోజూ ప్రయాణంలో వాహనాలు దెబ్బతిని, గుంతల్లో పడి నడుములు విరగ్గొట్టుకునే పరిస్థితులపై మనలో చాలామంది శాపనార్థాలు పెట్టి ఊరుకుంటారు. కానీ, బెంగళూరుకు చెందిన ఒక యువ ఇంజనీర్ మాత్రం ఆ కోపానికే కొత్త రూపాన్ని ఇచ్చాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగిస్తూ.. రోడ్డుపై ఉన్న గుంతలను గుర్తించి, సంబంధిత కాంట్రాక్టర్‌పై నేరుగా ఫిర్యాదు నమోదు చేసే అత్యంత శక్తివంతమైన యాప్‌ను రూపొందించి సంచలనం సృష్టించాడు.
తన కారు గుంతల్లో పడి తరచూ పాడైపోతుండటంతో విసిగిపోయిన ఈ ఇంజనీర్, అత్యాధునిక కోడెక్స్ ప్రాసెస్ సాయంతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశాడు. దీనికోసం తన కారుకు జీపీఎస్ , యాక్సిలెరోమీటర్ సౌకర్యం ఉన్న ఒక డ్యాష్ క్యామ్‌ను అమర్చాడు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కారు కదిలే తీరు, రోడ్డుపై ఉండే దృశ్యాలను ఈ కెమెరా నిరంతరం రికార్డ్ చేస్తుంది. ఇందులో అమర్చిన 'విజన్ మోడల్' సాంకేతికత రోడ్డుపై ఉండే ప్రతి గుంతను విశ్లేషించి.. అది చిన్నదా, మధ్యస్థమైనదా లేక ప్రాణాంతకమైన పెద్ద గుంతనా అనే విషయాన్ని క్షణాల్లో వర్గీకరిస్తుంది.

క్యాచింగ్ పాయింట్.. 2,900 ప్రభుత్వ కాంట్రాక్టుల డేటా రీడింగ్!
ఈ యాప్‌లో అసలైన మాస్టర్ ప్లాన్ ఇక్కడే ఉంది! భారతదేశంలో చాలా వరకు ప్రధాన రహదారులకు కాంట్రాక్టర్ల ఫ్రీ మెయింటైనెన్స్ గ్యారంటీ ఉంటుంది. నిబంధనల ప్రకారం రోడ్డు పాడైతే ఆ కాంట్రాక్టరే ఉచితంగా బాగు చేయాలి. దీనికోసం సదరు ఇంజనీర్ రూపొందించిన యాప్, దాదాపు 2,900 ప్రభుత్వ టెండర్ కాంట్రాక్ట్ పత్రాలను క్షుణ్ణంగా శోధిస్తుంది. గుంతలున్న నిర్దిష్ట రహదారి టెండర్ నంబర్ ఏమిటి? ఆ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఎవరు? బాధ్యత వహించాల్సిన ప్రభుత్వ అధికారి ఎవరు? అనే వివరాలను చిటికెలో లాగేస్తుంది.
ఒక్కసారి ఆఫీస్‌కు వెళ్తే 12 ఫిర్యాదులు రెడీ!
జీపీఎస్ లోకేషన్ వివరాలు, గుంతల ఫోటోలు , సంబంధిత కాంట్రాక్టర్ వివరాలను జత చేస్తూ వెంటనే సమర్పించగల పూర్తి స్థాయి ఫిర్యాదు పత్రాన్ని ఈ యాప్ దానంతట అదే తయారు చేస్తుంది. సదరు ఇంజనీర్ ఇంటి నుంచి ఆఫీస్‌కు వెళ్లే ఒకే ఒక్క ప్రయాణంలోనే కారు డ్యాష్ క్యామ్ 12 పెద్ద గుంతలను గుర్తించగా.. క్షణాల వ్యవధిలో 12 మంది బాధ్యులపై అధికారిక ఫిర్యాదు పత్రాలు సిద్ధమైపోయాయి. సామాన్య పౌరులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యకు సాంకేతికతను జోడించి సమాధానం చెప్పిన ఈ ఐటీ ప్రయోగంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
An Indian engineer in Bengaluru got tired of potholes destroying his car.
— Vaibhav Sisinty (@VaibhavSisinty) August 15, 2026
So he built an app with Codex that detects them, finds who is responsible, and files a complaint.
Here is how it works. He installed a dashcam with GPS and an accelerometer. The app records everything… pic.twitter.com/8NAnc4cBms














Click it and Unblock the Notifications