తోసేశాడు బాబోయ్.. లాడ్జిలో లవర్స్ మధ్య గొడవ.. తర్వాత ఏం జరిగిందంటే..?
కర్ణాటకలోని బెంగళూరులో షాకింగ్ ఘటన జరిగింది. ఓ లాడ్జిలో ఇద్దరి ప్రేమికుల మధ్య చెలరేగిన వివాదం.. చివరకు విషాదాన్ని మిగిల్చింది. క్షణికావేశంలో ఆ యువతిని కిందకు తోసేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రియుడిని అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. ప్రియుడు కిందకు నెట్టేయడంతోనే తమ కుమార్తె మృతి చెందినట్లు తల్లి కీలక ఆరోపణలు చేసిన నేపథ్యం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇక కర్ణాటకలోని గంగమ్మగుడి పోలీస్ స్టేషన్ పరిధిలో నవంబర్ 19న ఈ ఘటన జరిగింది.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. హసన్ కు చెందిన 23 ఏళ్ల ఐశ్వర్య.. ఓ ప్రేవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సంతోష్ తో ప్రేమాయణం సాగిస్తోంది. అయితే అంతకుముందు అరుంధతి అనే మహిళ బాయ్ ఫ్రెండ్ అయిన సచిన్ తో ఐశ్వర్య ఓయో రూమ్ కు వెళ్లినట్లు సమాచారం. ఇదే విషయంపై అరుంధతి.. ఐశ్వర్య కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. దాంతో ఐశ్వర్యను ఆమె కుటుంబ సభ్యులు తిట్టారు. అటు ప్రియుడు సంతోష్ కూ ఐశ్వర్యపై అనుమానం పెరిగింది. ఈ క్రమంలో నవంబర్ 19 న ఐశ్వర్య- సంతోష్ ఇద్దరూ కలిసి ఓ లాడ్జ్ కు వెళ్లారు. అక్కడే ఇద్దరూ మద్యం సేవించారు.

ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది. తన కుటుంబ సభ్యులు కానీ.. సంతోష్ కానీ తనను నమ్మడం లేదని ఐశ్వర్య ఆవేదనతో మాట్లాడింది. ఇక ఇద్దరి మధ్య గొడవ తీవ్రతరం కావడంతో తాను చనిపోతానని ఐశ్వర్య చెప్పింది. దాంతో సంతోష్.. 'నువ్ ఏమైనా చేసుకో' అంటూ ఐశ్వర్యను గట్టిగా నెట్టేశాడు. దాంతో ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పిన ఐశ్వర్య కిటికీలోంచి కింద పడి మృతి చెందింది. ఇక కుమార్తె మృతిపై ఐశ్వర్య తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications
