క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి.. ఇంట్లోనే ఇలా చేస్తే మెతుకు మిగలదు!

తెలుగువారి భోజనంలో నిల్వ పచ్చళ్లకు ఉండే స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఆవకాయ లేదా నిమ్మకాయ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన పచ్చళ్లు కాకుండా, చలికాలంలో విరివిగా దొరికే తాజా క్యాలీఫ్లవర్‌తో అచ్చం ఆవకాయను తలపించేలా కమ్మని నిల్వ పచ్చడిని ఇంట్లోనే సులభంగా పెట్టుకోవచ్చు. సరైన కొలతలు, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ గోబీ పచ్చడి నెలల తరబడి తాజాగా ఉండటమే కాకుండా, తినేకొద్దీ నోరూరిస్తుంది.

ఈ పచ్చడి తయారీకి ఒక పెద్ద క్యాలీఫ్లవర్‌ను తీసుకుని పువ్వులను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నె లేదా గ్లాసుతో ముక్కలను కొలుచుకోవడం వల్ల మసాలాలు ఎంత వేసుకోవాలో తెలుస్తుంది.. ముందుగా బాగా మరిగించిన నీటిలో ఉప్పు, కొద్దిగా పసుపు వేసి, ఆ నీటిని క్యాలీఫ్లవర్ ముక్కలపై పోసి సరిగ్గా ఒక నిమిషం పాటు ఉంచి వెంటనే వడకట్టాలి. ఇలా చేయడం వల్ల ముక్కల్లో ఉండే సూక్ష్మక్రిములు తొలగిపోయి శుభ్రపడతాయి.

Cauliflower Pachadi Easy Homemade Cauliflower Pickle Recipe How to Make Long-Lasting Gobi Pachadi

తర్వాత ఆ ముక్కలను ఒక శుభ్రమైన కాటన్ వస్త్రంపై పలుచగా పరచి, ఫ్యాన్ గాలికి రెండు గంటలు లేదా ఎండలో గంట సేపు తడి ఏమాత్రం లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి.తడి ఆరిన మూడు గ్లాసుల క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని, అందులో అర గ్లాసు కారం, పావు గ్లాసు ఆవపిండి, పావు గ్లాసు ఉప్పు, కొద్దిగా పసుపు, వేయించి పొడి చేసిన మెంతిపిండి వేసి బాగా కలపాలి.

మరోవైపు స్టవ్‌పై బాణలి పెట్టి ముప్పావు గ్లాసు వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఈ తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే క్యాలీఫ్లవర్ ముక్కల మిశ్రమంలో కలపాలి. చివరగా మూడు నుంచి నాలుగు నిమ్మకాయల రసం పిండి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.

ధనియా రైస్ ..లంచ్ బాక్స్ లో ఘుమఘుమ.. ఇలా చేస్తే అద్భుతః
ధనియా రైస్ ..లంచ్ బాక్స్ లో ఘుమఘుమ.. ఇలా చేస్తే అద్భుతః

తయారుచేసిన పచ్చడిని గాలి చొరబడని జాడీలో వేసి ఒక రోజు పాటు పక్కన పెట్టాలి. మరుసటి రోజు ఉప్పు, కారం, పులుపు రుచి చూసి అవసరమైతే మరికొంత కలుపుకోవచ్చు. ఈ పచ్చడిలో నూనె పైకి తేలేలా ఉంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. తడి చెంచాలు వాడకుండా, గాజు లేదా పింగాణీ జాడీలో భద్రపరుచుకుంటే దాదాపు రెండు నుంచి మూడు నెలల వరకు ఈ క్యాలీఫ్లవర్ పచ్చడి పాడవకుండా రుచిగా ఉంటుంది. అన్నంలోకే కాకుండా చపాతీలు, దోసెల్లోకి కూడా ఇది ఎంతో బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+