Dhuandhar Falls: ప్రకృతి ప్రసాదించిన వరం.. ఈ జలపాతం చూడాలంటే రెండు కళ్లు సరిపోవు..!

భారత్ లో అనేక జలపాతాలు ఉన్నాయి. కానీ టక్కున గుర్తొచ్చేవి మాత్రం మూడు లేదా నాలుగు మాత్రమే ఉంటాయి. అయితే మధ్య ప్రదేశ్ లోని జబల్పూర్ జిల్లాలో ఉండే ఈ ధువాందర్ జలపాతం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ జలపాతం అందాలను చూడాలంటే రెండు కళ్లు సరిపోవు. ఈ జలపాతం నర్మదా నదిపైన ఉంది. ఇక్కడ నర్మదా నది దాదాపు 30 మీటర్లు అంటే 98 అడుగులు ఎత్తు నుంచి కిందకు దూకుతూ పర్యటకులను చూపు తిప్పుకోనివ్వకుండా కనువిందు చేస్తుంది. జబల్ పూర్ జిల్లాలోని భేడా ఘాట్ అనే ప్రముఖ పర్యాటక ప్రాంతంలో ఈ జలపాతం ఉంది. రెండు భారీ కొండల మధ్య నుంచి
నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఈ భేడా ఘాట్ కేవలం జలపాతానికే కాదు.. తూర్పు-పశ్చిమ ఒడ్డులను కలిపే కేబుల్ కార్ (రోప్‌ వే)తో పాటుగా పంచవటి ఘాట్ వద్ద బోటింగ్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి.

భేడా ఘాట్ ప్రాంతం జబల్ పూర్ జిల్లా కేంద్రానికి సుమారు 20 కి.మీ దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి వర్షాకాలం చివరిలో వెళ్తే నీటి ఉధృతి, పొగమంచు అందాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అలాగే అక్టోబర్ నుంచి మార్చి వరకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ఈ జలపాతానికి ధువాంధర్ అనే పేరు ఎలా వచ్చిందంటే..? ఈ జలపాతం సుమారు 98 అడుగుల ఎత్తు నుంచి కిందకు దూకుతుంది. అలాగే హిందీలో ధువాన్ అంటే పొగ, ధార్ అంటే ప్రవాహం అని అర్థం వస్తుంది. నర్మదా నది నీరు అంత ఎత్తు నుంచి కిందకు పడటంతో నీటి తుంపరుల ధాటికి చుట్టుపక్కల ఆ ప్రాంతం అంతా పొగ కమ్ముకున్నట్లు అవుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని ధువాంధర్ అని పిలుస్తుంటారు.

Dhuandhar Waterfall a gift from nature Here are all the details Jabalpur Madhya Pradesh latest news

ఇక ధువాంధర్ వాటర్ ఫాల్స్ కు సమీపంలో బోటింగ్ కూడా చేసే అవకాశం ఉంది. ఇక్కడకు సమీపంలోనే చౌసత్ యోగిని ఆలయం కూడా ఉంది. ఈ ప్రాంతానికి సమీపంలోనే నర్మదా హారతి, మదన్ మహాల్ కోట, గ్వారీఘాట్ ప్రాంతాల్ని కూడా సందర్శించవచ్చు. ఈ జలపాతం వద్దకు చేరుకోవాలంటే ముందుగా జబల్ పూర్ కు చేరుకోవాలి. జబల్ పూర్ కు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి రైలు, రోడ్డు మార్గాలతో పాటు డుమ్నా ఎయిర్‌ పోర్ట్ ద్వారా విమాన సదుపాయం కూడా ఉంది. మరికెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్ వేయండి..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+