పాకిస్తాన్ వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపిస్తోన్న చైనా- భారత్ కు ధీటుగా

పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధనా చరిత్రలో ఒక నూతన అధ్యాయం ఆవిష్కృతం కాబోతోంది. ఆ దేశ వైమానిక దళానికి చెందిన 40 ఏళ్ల వింగ్ కమాండర్ మహమ్మద్ జీషాన్ అలీ అంతరిక్షానికి వెళ్లనున్నాడు. పాకిస్తాన్ మొట్టమొదటి ఆస్ట్రోనాట్ గా చరిత్ర సృష్టించాడు. చైనా సొంతంగా నిర్మించిన తియాంగ్యాంగ్ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టబోతోన్న తొలి విదేశీ వ్యోమగామి, నాన్ చైనీస్ పౌరుడిగా ఆయన ఓ నూతన అధ్యాయానికి నాంది పలకనున్నాడు.

చైనాకు చెందిన షెంజౌ 24 మానవ సహిత వ్యోమనౌక ద్వారా రోదసిలోకి అడుగుపెట్టనున్నాడు.. జీషాన్ అలీ. ఈ మిషన్‌లో పేలోడ్ స్పెషలిస్ట్‌గా వ్యవహరించనున్నాడు. ఆయనతో పాటు మొత్తం ముగ్గురిని అంతరిక్షానికి ఎంపిక చేసింది చైనా. సీనియర్ వ్యోమగాములు టాంగ్ హాంగ్‌బో, వు యీ.. ఈ వ్యోమనౌకలో నింగిలోకి ప్రయాణించనున్నారు. పాకిస్తాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ సుపార్కో, స్పేస్ సెంటర్ మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ ఎంపిక ప్రక్రియ జరిగింది.

Pakistan Zeeshan Ali was named a crew member of China Shenzhou 24 space mission as first astronaut

స్పేస్, బయో టెక్నాలజీ, మెటీరియల్స్ రీసెర్చ్, ఫుడ్ సెక్యూరిటీ వంటి అంశాలపై తియాంగ్యాంగ్ స్పేస్ స్టేషన్‌లో ఈ ప్రయోగాలు జరుగనున్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులను ఎంపిక చేయడానికి చైనా స్పేస్ స్టేషన్ పాకిస్తాన్ లోని వివిధ యూనివర్శిటీలు, పరిశోధనా సంస్థల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. 300కు పైగా ప్రతిపాదనలు చైనాకు అందాయి. వీటన్నింటినీ వడబోసి ఈ నాలుగు ప్రాజెక్టులను ఈ మిషన్ కోసం ఎంపిక చేసింది.

జనవరి 1 నుంచి నిరుద్యోగ భృతి అమలు
జనవరి 1 నుంచి నిరుద్యోగ భృతి అమలు

జీషన్ అలీ, టాంగ్ హాంగ్ బో, వు యీ తో కూడిన ఈ వ్యోమనౌక.. వాయవ్య చైనాలోని జియుక్వాన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి బీజింగ్ కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 8:18 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. చైనా మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో ఒక విదేశీ వ్యోమగామి పాలుపంచుకోవడం ఇదే తొలిసారి. జీషాన్ అలీ తియాంగ్యాంగ్ అంతరిక్ష కేంద్రంలో దాదాపు వారం రోజుల పాటు గడపనున్నారు. అక్కడ పరిశోధనలు పూర్తి చేసుకున్న అనంతరం షెన్‌జౌ 23 ద్వారా భూమికి తిరిగి రానున్నారు.

మోదీ మళ్లీ ప్రధాని అయితే.. దేశంలో ఇక ఎన్నికలు అనేవి జరక్కపోవచ్చు
మోదీ మళ్లీ ప్రధాని అయితే.. దేశంలో ఇక ఎన్నికలు అనేవి జరక్కపోవచ్చు

పాకిస్తాన్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ పైలెట్‌గా జీషాన్ అలీకి సుదీర్ఘ అనుభవం ఉంది. రోదసిలోకి వెళ్లడానికి చైనా స్పేస్ సెంటర్ లో శిక్షణ పొందారు. వ్యోమనౌక నిర్వహణ, అంతరిక్షంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను తట్టుకోవడం, జీరో గ్రావిటీ వాతావరణానికి అలవాటు పడటంతో పాటు తోటి వ్యోమగాములతో మాట్లాడటానికి చైనీస్ భాష మాండరిన్ ను కూడా ధారాళంగా మాట్లాడటం కూడా నేర్చుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

యూపీలో సీట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు.. !!
యూపీలో సీట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు.. !!

ఈ మిషన్ కోసం జీషాన్ తో పాటు పాకిస్తాన్ నుంచి ఖుర్రమ్ దావూద్‌ అనే వ్యోమగామిని కూడా సెలెక్ట్ చేసింది చైనా. తుది మిషన్ కోసం జీషాన్ అలీ వైపు మొగ్గు చూపింది. చైనా అంతర్జాతీయ స్థాయిలో తన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాలను విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో దేశానికి చెందిన వ్యోమగామికి తమ స్పేస్ స్టేషన్‌లో అవకాశం కల్పించడం ఇదే తొలిసారి.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీషాన్ అలీ, టాంగ్ హాంగ్ బో, వు యీ మాట్లాడారు. 25 కోట్ల పాకిస్తానీల కలలు, ఆశయాలను అంతరిక్షంలోకి తీసుకెళ్తోన్నానని వ్యాఖ్యానించారు. తమ దేశంలోని యువతలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, అంతరిక్ష పరిశోధనల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి, సైన్స్ రంగంలో సరికొత్త అవకాశాలను వెతుక్కోవడానికి ఈ మిషన్ ప్రేరణ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+