Bhogi First Review: శర్వానంద్ 'భోగి' మూవీ ఫస్ట్ రివ్యూ ఇదే..
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. హిట్స్.. ప్లాఫ్స్ తో సంబంధం లేకుండా వరుసగా మూవీస్ చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ ను నింపుతున్నారు. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో అలరించారు. ఈ ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా వచ్చిన నారీ నారీ నడుమ మురారి చిత్రంతో మంచి హిట్ అందుకున్నారు శర్వానంద్. ఆ తర్వాత సమ్మర్ లో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన బైకర్ మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు అభిలాష్ రెడ్డి అద్భుతంగా తెరకెక్కించారు. ఇక భోగి మూవీ తర్వాత ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ మరో నాలుగు రోజుల్లో అంటే నవంబర్ 27 న రిలీజ్ కానుంది. అసలైతే ఈ మూవీ నవంబర్ 12న విడుదల కావాల్సి ఉంది. కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో వాయిదా పడింది.
అయితే ఇటీవల రిలీజ్ అయిన భోగి మూవీ ట్రైలర్ అద్భుతంగా ఉంది. 1960 ల కాలంలో తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని ఓ గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. ఈ మూవీలో శర్వానంద్ గంగ అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో ఐదుగురు చెల్లెళ్లకు అన్నగా మెప్పించనున్నారు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరితోపాటు శరతస్వాత్, అవినాష్, లాల్, దయానంద రెడ్డి, రోహత్ పట్నాయక్, ఆడుకాలం నరేన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. అలాగే లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.

ఇక ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. సెన్సార్ బోర్డ్ భోగి చిత్రానికి A సర్టిఫికెట్ ను జారీ చేసింది. అంటే 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే ఈ సినిమాను థియేటర్లలో చూడాలన్నమాట. ఇక ఈ మూవీ రన్ టైమ్ విషయానికి వస్తే 2 గంటల 34 నిమిషాలుగా ఉంది. ఇక ఈ మూవీలో శర్వానంద్ మునుపెన్నడూ చేయని రా అండ్ రస్టిక్ పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే అనుపమ పరమేశ్వరన్ కూడా బలమైన గ్రామీణ పాత్రలో మెరవనున్నట్లు స్పష్టం అవుతోంది. అటు దర్శకుడు సంపత్ నంది సైతం గతంలో ఎన్నడూ లేని విధంగా హింస, రక్తపాతం డోస్ మరింతగా పెంచినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టం అవుతోంది. ఇక ఈ మూవీ ఫుల్ రివ్యూ కోసం నవంబర్ 27 వరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications
