నీ గురు దక్షిణే కారణం, ఇదీ జరిగిందీ - రేవంత్ పై హరీష్ సంచలనం..!!
తెలంగాణలో ఇప్పుడు వాటర్ వార్ జరుగుతోంది. సీఎం రేవంత్ లక్ష్యంగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు సీఎం రేవంత్ సమాధానం ఇచ్చారు. తన పైన చేస్తున్న విమర్శలన్నింటికీ బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు. వారి హయాంలోనే ఒప్పందాలు జరిగాయని వివరించారు. తాను చర్చకు సిద్దమని సవాల్ చేసారు. కాగా, ఇప్పుడు సీఎం రేవంత్ వ్యాఖ్యల పైన హరీష్ ఘాటు వ్యాఖ్యలు చేసారు. పంటలు ఎండిపోవడానికి సీ చేతగానితనం.. రేవంత్ గురు దక్షిణే కారణమని హరీష్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ బయటపెడితే పాత తేదీలతో రేవంత్ ఉత్తరాలు రాస్తారని, ఇదే జరుగుతోందని అన్నారు. బనకచర్ల, పల్నాడు తాగు నీటి పథకం విషయంలోనూ అదే జరిగిందని వెల్లడించారు.
నీటిహక్కులపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల కోసం సెక్షన్ 3 తేవడం తప్పా అని ప్రశ్నించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడిందే బీఆర్ఎస్ పార్టీ అని గుర్తు చేశారు. 30 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీ హయాంలో పాలమూరు జిల్లాలో 30 వేల ఎకరాలకే నీళ్లిచ్చారన్న హరీశ్ బీఆర్ఎస్ హయాంలో పాలమూరు జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్టు వివరించారు. సాగర్ నుంచే పల్నాడుకు నీళ్లు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హయాంలో ఏపీ ఇచ్చిన జీవోలో ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో వలసలకు కాంగ్రెస్‌యే కారణమని ఆరోపించారు. తెలంగాణకు నీళ్లు ఎత్తిపోయమంటే రేవంత్ దుమ్మెత్తిపోస్తున్నారంటూ మండిపడ్డారు.

హరీష్ కీలక వ్యాఖ్యలతో
రేవంత్ సీఎం అవ్వగానే ఏపీ సీఎం చంద్రబాబుకు ధైర్యం వచ్చిందని హరీష్ వ్యాఖ్యానించారు. 2024 డిసెంబర్ 3లో చంద్రబాబు జీవోలు 403, 405 ద్వారా కుప్పంకు లైనింగ్ చేయించార ని... చంద్రబాబు జీవోలు రేవంత్ ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. సీఎం హోదాలో ఉండి అబద్ధాలు చెబితే.. అవి నిజాలు అయిపోవన్నారు. నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మేం నీళ్ల లెక్కలు అడిగితే.. సీఎం నైరాశ్యంతో మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణకు కృష్ణా నది నీళ్లను ఎత్తిపోయమంటే.. దుమ్మెత్తిపోస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు ఏజెంట్‌ను రేవంత్ పక్కన పెట్టుకున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి హయాంలో కొత్తగా ఒక్క రిజర్వాయర్ అయినా కట్టారా అని ప్రశ్నించారు. బురద రాజకీయం, చిల్లర రాజకీయం తప్ప రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.













Click it and Unblock the Notifications
