రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!!

చిలకడదుంప. చలికాలంలో ఈ దుంపకు ప్రత్యేకత ఉంది. పోషకాహార నిపుణుల ప్రకారం చిలగడ దుంప ఒక అద్భుతమైన సూపర్‌ఫుడ్. ప్రతిరోజూ మన డైట్‌లో చిలగడదుంప లను భాగం చేసుకో వడం వల్ల శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. ఈ దుంపతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ దుంప తీసుకోవటంతో షుగరు, బీపీ నియంత్రణలో ఉండటంతో పాటుగా గుండెకు మేలు చేస్తుందని స్పష్టం చేస్తున్నారు.

చాలామంది కాల్చిన చిలగడదుంప ముక్కలపై కొద్దిగా చాట్ మసాలా, నిమ్మరసం చల్లుకుని తీసుకుంటారు. ఇలా తినడం ఈ సీజన్‌లో తీసుకోగలిగే ఉత్తమమైన ఆహారాల్లో ఒకటి. కాగా, ఈ దుంప ద్వారా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిలగడదుంపలలో బీటా-కెరోటిన్ అనే యాంటీఆక్సిడెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలోకి వెళ్లిన తర్వాత విటమిన్-ఎ గా మారుతుంది. విటమిన్-ఎ కంటి చూపును మెరుగుపరచడానికి, వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలను, రేచీకటిని నివారించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో విటమిన్-సి మరియు ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, వ్యాధి నిరోధక శక్తిని బలపరుస్తాయి.

TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
sweet-potatoes-amazing-health-benefits-of-including-them-in-your-daily-diet-report-here

నిపుణుల సూచనలు

అదే విధంగా చిలగడదుంపల్లో పొటాషియం కూడా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించ డం లో కీలక పాత్ర పోషిస్తుంది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే చిలగడదుంపలు శరీరానికి స్థిరమైన శక్తిని అందిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడానికి కారణం కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అయితే చిలగడదుంపలను అతిగా తినకూడదు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, తక్కువ కార్బొహైడ్రేట్లు తీసుకోవాలని వైద్యులు సూచించినవారు, సున్నితమైన జీర్ణవ్యవస్థ కలిగినవారు వీటిని తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+