"విజయ్ కైస్తవుడు కాబట్టే..!"- మతం పేరుతో బీజేపీ దాడి మొదలు..!

తమిళనాడు రాజకీయాల్లో ఆస్తికతకు ఎంత చోటుందో, నాస్తికతకూ అంతే ప్రాముఖ్యముంది. దీని వెనుక పెరియార్ కాలం నాటి చారిత్రక నేపథ్యం కీలక కారణం. అయితే కొన్నేళ్లుగా రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటూ వస్తున్నాయి. అయితే తాజాగా తమిళనాడులో తిరుప్పరంకుండ్రం దీపం వివాదం మాత్రం విజయ్ ప్రభుత్వానికి చుట్టుకుంటోంది.

దటీజ్ విజయ్..! ప్రియాంక అడగ్గానే ఏమాత్రం కాదనకుండా..!
దటీజ్ విజయ్..! ప్రియాంక అడగ్గానే ఏమాత్రం కాదనకుండా..!

మధురైలోనని తిరుప్పరంకుండ్రం కొండపై ముస్లింల సికిందర్ బాదుషా దర్గా ఉంది. మరోవైపు ఇదే కొండపై కార్తీక దీపం వెలిగిస్తామని హిందూ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఈ కొండపై ఉన్న దీపత్తూన్ అనే రాత్రి స్తంభం వద్ద కార్తీక దీపాన్ని ఎక్కడ వెలిగించాలి, ఎవరు వెలిగించాలనే వివాదం తలెత్తింది. ఇది కాస్తా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంటోంది. భక్తులు ఈ దీపత్తూన్ స్తంభం ఆలయంలో భాగమని, అక్కడే కార్తీక దీపం వెలిగించాలని పట్టుబడుతున్నారు. కానీ ప్రభుత్వం.. ఈ స్తంభం బ్రిటిష్ కాలపు సర్వే నెట్ వర్క్ కు చెందినదని, అక్కడ దీపం వెలిగించే సంప్రదాయం లేదని చెబుతోంది. అలాగే ముస్లింలు ఆ స్తంభంపై తమకు హక్కులున్నట్లు చెప్తూ 1923 నాటి తీర్పును సాక్ష్యంగా చూపిస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఈ స్తంభంపై దీపం వెలిగించేందుకు అనుమతివ్వడం లేదు.

Tamil Nadu BJP Chief Targets CM Vijay Over Deepam Row Cites His Christian Faith
స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే పాడె మోసిన విజయ్..! జెయింట్ కిల్లర్ కు తుది వీడ్కోలు..!
స్టాలిన్ ను ఓడించిన ఎమ్మెల్యే పాడె మోసిన విజయ్..! జెయింట్ కిల్లర్ కు తుది వీడ్కోలు..!

ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ వెళ్లడంతో ఈ ఏడాది ఒక్కసారికి దీపం వెలిగించే అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై విజయ్ సర్కార్ అప్పీలుకు వెళ్లింది. దీంతో రాష్ట్రంలో బీజేపీ నేతలు సీఎం విజయ్ పై మండిపడుతున్నారు. ఆయన క్రైస్తవుడు కావడం వల్లే ఈ కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతివ్వకుండా అడ్డుపడుతున్నారని రాష్ట్ర బీజేపీ (Tamil Nadu BJP) అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆరోపించారు. సుప్రీంకోర్టు అనుమతి ఉన్నప్పటికీ, కొండపై సాంప్రదాయ దీపాన్ని వెలిగించకపోతే, ముఖ్యమంత్రిని తాను క్రైస్తవునిగానే పరిగణిస్తానని ఆయన పేర్కొన్నారు.

కోర్టు ఆదేశాలను అమలు చేయడానికి నిరాకరించడం అనేది ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రి చేసే తీవ్ర ధిక్కార చర్య అవుతుందని నాగేంద్రన్ హెచ్చరించారు. సుప్రీంకోర్టు తీర్పు అమలును పర్యవేక్షించేందుకు, దీపం వెలిగించారో లేదో స్వయంగా చూసేందుకు మంగళవారం మధ్యాహ్నం తాను తిరుప్పరంకుండ్రంకు వెళ్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు తెలిపారు. ముఖ్యంగా, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ ఆయన దీపం వెలిగించడానికి నిరాకరిస్తే, సుప్రీంకోర్టు ఆదేశాన్ని బహిరంగంగా ధిక్కరించిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే అవుతారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+