రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ కీలక హామీ, మారుతున్న లెక్కలు..!!

తెలంగాణ కాంగ్రెస్ లో పరిణామాల పై హైకమాండ్ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది. కొత్త ఇంఛార్జ్ కు బిగ్ టాస్క్ అప్పగించారు. పార్టీలో కొద్ది రోజులుగా కొందరు ఎమ్మెల్యేలు నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేలా చేస్తున్న వ్యాఖ్యల పైన ఇప్పుడు కార్యాచరణ ప్రారంభించారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఇద్దరూ సందీప్ తో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. కీలక అంశాలు చర్చించారు. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన హామీ ఇప్పుడు ఆసక్తిగా మారుతోంది.

తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారి హైకమాండ్ వరకు చేరాయి. సీఎం రేవంత్ లక్ష్యంగా చేసిన వ్యాఖ్యల పైన పార్టీ నాయకత్వం సీరి యస్ అయింది. తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా నియమితులైన సందీప్ ను కలిసి అన్ని అంశాలు చర్చించాలని హైకమాండ్ సూచించింది. దీంతో, ఈ ఇద్దరూ సందీప్ తో భేటీ అయ్యారు. అన్ని విషయాల పైన చర్చించారు. కాగా, ఈ సమావేశం లో పార్టీని బలోపేతం చేయడంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడానికి అవసరమైన సూచనలను రాజగోపాల్ రెడ్డి ఇన్‌చార్జి సందీప్‌కు అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై కూడా ఆయన చర్చించారు. పార్టీలో మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చిన సందీప్, ఓపికతో ఉండాలని రాజగోపాల్ రెడ్డికి సూచించినట్లు తెలుస్తోంది.

TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
rajagopal-reddy-anirudh-reddy-meet-congress-state-affairs-in-charge-sandeep-key-disucssions

పార్టీ ఇంఛార్జ్ హామీతో

అదే విధంగా అనిరుధ్ రెడ్డి సైతం ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను వివరించినట్లు పార్టీ నేత ల సమాచారం. పార్టీకి నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయాలనే ఉద్దేశం తనకు ఎప్పుడూ లేదని అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. అవినీతిని ఎత్తిచూపడానికి మరియు నియోజకవర్గాలకు నిధులు విడుదల చేయాలనే ఉద్దేశంతోనే తాను మాట్లాడానని తెలిపారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అవినీతి గురించి మాట్లాడారని గుర్తు చేస్తూ, బిల్లులు క్లియర్ చేయకపోతే ఎవరైనా చనిపోతారని తాను అన్నట్లు వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అయితే, పార్టీలో ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను కలవాలని సందీప్ సూచించారు. ఓపెన్ గా పార్టీ - ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తేల్చి చెప్పారు. దీంతో.. ఇక ఇప్పుడు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+