బంగారం ధరలపై తప్పిన అంచనాలు.. !!
దేశంలో బంగారం, వెండి ధరలు క్రమంగా పుంజుకొంటోన్నాయి. రికార్డుస్థాయి పతనం నుంచి కోలుకుంటోన్నాయి. అంతర్జాతీయంగా నెలకొంటోన్న సానుకూల పరిణామాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతోండటం, ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు మెరుగుపడటం వంటి కారణాలతో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది.. బులియన్ మార్కెట్ లో. దీని ప్రభావం బంగారం, వెండి రేట్లు పెరగడానికి దారి తీస్తోన్నాయి.
గ్లోబల్ ట్రేడింగ్‌లో స్పాట్ గోల్డ్ ఔన్సుకు 0.11 శాతం పెరిగి 3,631.20 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. స్పాట్ వెండి ఔన్సుకు 0.019 శాతం ఎగబాకి 42.69 డాలర్లకు చేరుకుంది. గురునానక్ జయంతి పండగ సందర్భంగా నేడు దేశీయ కమోడిటీ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ సెషన్‌కు సెలవు. ఈ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రేడింగ్ నిలిచిపోనుంది. సాయంత్రం 5 నుంచి రాత్రి ముగింపు సమయం వరకు ఈవెనింగ్ సెషన్ యథావిధిగా కొనసాగుతుంది.

సోమవారం నాటి సెషన్‌లో డిసెంబర్ కాంట్రాక్ట్ ఎంసీఎక్స్ గోల్డ్ 3.48 శాతం పెరిగి రూ.1,26,021 వద్ద, ఎంసీఎక్స్ సిల్వర్ 4.32 శాతం లాభపడి రూ.1,54,205 వద్ద ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్ భేటీలో మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు మార్కెట్‌లో బలపడటమే పసిడి పతనానికి ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. అధిక వడ్డీ రేట్లు, పెరిగిన బాండ్ రాబడుల వల్ల బంగారంలో పెట్టుబడుల ఆకర్షణ స్వల్పంగా తగ్గుతుంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,26,770 వద్ద స్థిరపడింది. 10 గ్రాముల 22 క్యారెట్లు రూ. 1,14,573 గా నమోదైంది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 1,26,540 గా రికార్డు కాగా.. 22 క్యారెట్లు రూ. రూ. 1,14,162 వద్ద ట్రేడ్ అయింది. చెన్నైలో ఇవే రేట్లు వరుసగా రూ. 1,25,930, రూ.1,14,519 వద్ద నిలిచాయి. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,25,670, 22 క్యారెట్లు రూ. 1,14,781 వద్ద కొనసాగుతున్నాయి.
నేడు నమోదైన బంగారం రేట్లు ఒక గ్రాముకు ఇలా ఉన్నాయి
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 12,780, 22 క్యారెట్లు - రూ. 11,715, 18 క్యారెట్లు - రూ. 9,585
ముంబై..
24 క్యారెట్లు- రూ. 12,780, 22 క్యారెట్లు - రూ. 11,715, 18 క్యారెట్లు - రూ. 9,585
బెంగళూరు..
24 క్యారెట్లు- రూ. 12,780, 22 క్యారెట్లు - రూ. 11,715, 18 క్యారెట్లు - రూ. 9,585
హైదరాబాద్..
24 క్యారెట్లు- రూ. 12,780, 22 క్యారెట్లు - రూ. 11,715, 18 క్యారెట్లు - రూ. 9,585
విజయవాడ..
24 క్యారెట్లు- రూ. 12,780, 22 క్యారెట్లు - రూ. 11,715, 18 క్యారెట్లు - రూ. 9,585
విశాఖపట్నం..
24 క్యారెట్లు- రూ. 12,780, 22 క్యారెట్లు - రూ. 11,715, 18 క్యారెట్లు - రూ. 9,585












Click it and Unblock the Notifications
