తిరుమల చరిత్రలో తొలిసారి, 121 కిలోల స్వర్ణాభరణాల కానుక- చంద్రబాబు సమక్షంలో..!!

తిరుమల ఆలయ చరిత్రలోనే భారీ కానుక. ఓ భక్తుడు ఏకంగా 121 కిలోల స్వర్ణాభరాలను శ్రీవారికి సమర్పించనున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. స్వామి వారికి అలంకరించే 46 రకాల బంగారు ఆభరణాల సెట్‌ను ప్రత్యేకంగా ఆ భక్తుడు చేయించారు. సీఎం చంద్రబాబు సమక్షంలో టీటీడీకి ఈ నెల 26న అందించనున్నారు. ఇందు కోసం తిరుమల వస్తున్న సీఎం చంద్రబాబు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల పైన సమీక్ష చేయనున్నారు.

తిరుమల శ్రీవారికి ఎన్నారై భక్తుడు ఏకంగా 121 కిలోల స్వర్ణాభరణాలను కానుకగా ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. తాను స్థాపించిన కంపెనీ లాభాల్లో వాటాగా శ్రీవారికి బంగారంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా.. ఇంత మొత్తంలో కానుకగా ఇవ్వాలని నిర్ణయించిన ఆ భక్తుడు తన పేరు బయటకు రాకుండా చూడాలని సీఎం చంద్రబాబును కోరారు. దీంతో, వేంకటేశ్వరస్వామికి 121 కేజీల భారీ స్వర్ణాభరణాల సెట్‌ను సమర్పించే కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 26వ తేదీన తిరుమల రానున్నారు. చెన్నైకి చెందిన ఓ ఎన్‌ఆర్‌ఐ శ్రీవారి కోసం ఈ ఆభరణాలను సిద్ధం చేయించారు. తిరుమల ఆలయ చరిత్రలోనే ఇంత భారీ కానుకను ఓ భక్తుడు విరాళంగా అందజేయనుండటం ఇదే మొదటిసారి. ఈ క్రమంలో శ్రీవారి అలంకరణకు ఉపయోగకరంగా ఉండేలా టీటీడీతో సదరు దాత సంప్రదింపులు జరిపారు.

TTD: వీరికి టోకెన్లు లేకపోయినా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు, తొలి రెండు రోజులు ఇలా..!!
TTD: వీరికి టోకెన్లు లేకపోయినా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు, తొలి రెండు రోజులు ఇలా..!!
cm-chandrababu-to-visit-tirumala-on-november-26-for-offering-121-kg-gold-ornaments-to-srivaru-detai

చెన్నైకు చెందిన ఎన్నారై భక్తుడి విరాళం

కాగా, ఓ జ్యువెలరీ సంస్థ ద్వారా 46 రకాల బంగారు ఆభరణాల సెట్‌ను తయారు చేయించారు. ఇందులో కిరీటం, భుజకీర్తులు, శంఖుచక్రాలు, వడ్డాణం, హస్తాలు, మెడ ఆభరణాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి రిచ్‌ గాడ్‌ గా చెప్పుకుంటారు. గతేడాది లెక్కల ప్రకారం బ్యాంకుల్లోని బంగారు నిల్వల విలువే లక్షన్నర కోట్లు. ఇక, 20 వేల కోట్ల డిపాజిట్లతో పాటు 10 వేల కోట్ల విలువైన ఆభరణాలు ఉన్నాయి. వీటిలో ఆరు వేల కోట్ల విలువైన ఆభరణాలు మాత్రమే స్వామి అలంకరణ కు వినియోగిస్తారు. మరోవైపు శ్రీవారికి దేశవ్యాప్తంగా ఉన్న భూములు, భవనాల ఆస్తుల విలువ దాదాపు రూ.రెండు లక్షల కోట్లకుపైమాటే. ఇలా మొత్తం లెక్క కడితే దాదాపు స్వామి సంపద నాలుగు నుంచి ఐదు లక్షల కోట్లు దాటుతుందని అంచనా. వందల ఏళ్లుగా ఎందరో రాజులు, నవాబుల నుంచి సామాన్య భక్తుల వరకు అందించిన కానుకలతో సంపన్నుడిగా శ్రీవారు నిలిచారు. అయితే వీటన్నింటిలో ప్రత్యేకంగా నిలిచేలా, ఒకే భక్తుడు 121 కేజీల బంగారు ఆభరణాలను ఇవ్వడం టీటీడీ చరిత్రలో మైలు రాయిగా మారనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+