మోదీ మళ్లీ ప్రధాని అయితే.. దేశంలో ఇక ఎన్నికలు అనేవి జరక్కపోవచ్చు

దేశ రాజకీయాల్లో 2029 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే విమర్శలు, ప్రతివిమర్శల పర్వం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోన్నాయి. రాబోయే రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థల భవిష్యత్తుపై ఆయన లేవనెత్తిన అంశాలు దీనికి కేంద్రబిందువు అయ్యాయి.

2029 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చి, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే దేశంలో ఇకపై ఎన్నికలు జరిగే అవకాశమే ఉండదని అశోక్ గెహ్టాల్ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ అనేది నామమాత్రమే అవుతుందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగబోవని అన్నారు. ఆ పరిస్థితి వస్తే ప్రతిపక్షాల ఉనికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని, దేశంలో ఒకే ఒక్క అధికార పక్షం మాత్రమే మిగులుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Democratic elections could become meaningless if the BJP returns to power in 2029 says Ashok Gehlot

జైపూర్ లో ఆయన ఇండియన్ ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఎన్నికల సంఘం కూడా పూర్తిగా అధికార పార్టీ నియంత్రణలోకి వెళ్తుందని అశోక్ గెహ్లాట్ చెప్పారు. దీనికి అనుగుణంగా బీజేపీ ఎప్పటి నుంచో పావులు కదుపుతోందని పేర్కొన్నారు. ఓటర్ల సవరణ జాబితా, కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ నియామకంలో చోటు చేసుకున్న భారీ మార్పులు.. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా అభివర్ణించారు. ప్రతిపక్షాల ఉనికి లేకుండా చేయడమే బీజేపీ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు.

భారీ భూకంపం- వణికిన భారత్ సరిహద్దు ప్రాంతం
భారీ భూకంపం- వణికిన భారత్ సరిహద్దు ప్రాంతం

లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం కూడా ఇందులో భాగమేనని అశోక్ గెహ్లాట్ చెప్పారు. వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోందని, ఆ విషయం ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమౌతోందని అన్నారు. భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వ్యాపించిన అవినీతి, ఇష్టారాజ్యంగా జరుగుతున్న కార్పొరేటీకరణపై జనం మండిపడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

అర్ధరాత్రి కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడికి షాక్ ఇచ్చిన కేంద్రం
అర్ధరాత్రి కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడికి షాక్ ఇచ్చిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల విశ్వసనీయతను దెబ్బతీస్తోందని, ప్రజాస్వామ్య హక్కులను కేంద్రం కాలరాస్తోందని ప్రజలు గమనించారని అన్నారు. రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ సాధించిన ఘన విజయాన్ని అశోక్ గెహ్లాట్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. దేశ రాజకీయాల్లో మార్పు అనేది రాజస్థాన్ నుండే ఆరంభమౌతుందని అన్నారు. రాజస్థాన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ మట్టికరవడం దీనికి నిదర్శనమని గుర్తు చేశారు. ప్రజల్లో బీజేపీ పట్ల పేరుకుపోయిన అసహనం, అసంతృప్తికి ఇది నిదర్శనమని అన్నారు.

నేడు కార్తీక పౌర్ణమి- భరణీ దీప దర్శనంతో పులకించిన అరుణాచలం
నేడు కార్తీక పౌర్ణమి- భరణీ దీప దర్శనంతో పులకించిన అరుణాచలం

విచ్చలవిడిగా అవినీతి పెరిగిందనే అభిప్రాయాల్లో జనంలో బలంగా నాటుకుపోయిందని, బీజేపీతో పోల్చుకుంటే గత కాంగ్రెస్ ప్రభుత్వాలే మేలు అని భావించారని చెప్పారు. బీజేపీ పట్ల గ్రామస్థాయిలో ప్రజల్లో ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనేది ఈ ఎన్నికల్లో తేలిందని అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీకి ఓటమి తప్పదని, పంజాబ్ లో కూడా ఆ పార్టీ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని అశోక్ గెహ్లాట్ చెప్పారు. పంజాబ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+