చిత్తూరు లోక్ సభ ఎన్నికల్లో 31417 ఓట్ల గల్లంతు ? తేల్చేసిన ఏపీ సర్కార్.. !

ఏపీలోని చిత్తూరు లోక్ సభ స్ధానంలో 2024లో జరిగిన ఎన్నికల సందర్భంగా భారీ ఎత్తున ఓట్లు గల్లంతైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు రిపోర్టర్స్ కలెక్టివ్ అనే జాతీయ మీడియా వెబ్ సైట్ ప్రచురించిన కథనం కలకలం రేపుతోంది. ఇందులో 2024 చిత్తూరు లోక్ సభ ఎన్నికల పోలింగ్ రోజు సాయంత్రం 6 గంటలకు క్యూలో నిలబడిన ఓటర్ల సంఖ్య ఒకసారి 56,067 అని, మరోసారి 24,596 అని ఎన్నికల కమిషన్ అంతర్గత నివేదికల్లో పేర్కొందంటూ ఈ కథనం తెలిపింది. తద్వారా ఏకంగా 31,471 ఓట్లు గల్లంతైనట్లు చెబుతోంది. దీనిపై స్పందించిన ఏపీ ఎన్నికల ప్రధానాధికారి 56,067 ఓటరు స్లిప్పుల్ని క్యూలో ఉన్న వారికి తాము ఇచ్చినట్లు స్పష్టత ఇచ్చారు.

అయినా దీనిపై రాజకీయ దుమారం ఆగకపోవడంతో ఏపీ సర్కార్ (AP Govt) రంగంలోకి దిగింది. ఫ్యాక్ట్ చెక్ ద్వారా దీనిపై వివరణ ఇచ్చింది. చిత్తూరు ఎంపీ ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల తర్వాత క్యూలలో ఉన్న ఓటర్ల సంఖ్యకు 56,067, దాని పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల లెక్క అయిన 24,596 మధ్య 31,471 ఓట్ల తేడా ఉందని, దీనివల్ల 31,471 ఓట్లు మాయమయ్యాయని, సిస్టమాటిక్ రిగ్గింగ్ జరిగిందని 'ది రిపోర్టర్స్ కలెక్టివ్' అనే మీడియా సంస్థ ప్రచురించిన తప్పుడు వార్తను, మరికొన్ని మీడియా, సోషల్ మీడియా పోస్ట్‌లో తిప్పుతున్నారని తెలిపింది. అయితే 31,471 ఓట్లు మాయమయ్యాయన్నది పూర్తిగా తప్పు అని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ ఆరోపణలపై అధికారికంగా స్పష్టత ఇచ్చారని పేర్కొంది.

AP Govt Fact-Checks 31 471-Vote Difference Claims in 2024 Chittoor Lok Sabha Elections
చిత్తూరు లోక్ సభ ఎన్నికల వివాదం-31 వేల ఓట్ల తేడాపై ఈసీ క్లారిటీ..!
చిత్తూరు లోక్ సభ ఎన్నికల వివాదం-31 వేల ఓట్ల తేడాపై ఈసీ క్లారిటీ..!

చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోలైన తుది ఓట్లు అంటే Form 17C లో నమోదైనవి, ఈవీఎంలలో లెక్కించిన ఓట్లు ఖచ్చితంగా సరిపోయాయని తెలిపింది. పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల పోలింగ్ ఏజెంట్లకు సంతకం చేసిన ఫామ్ 17C కాపీలను అందించారని పేర్కొంది. అయితే సాయంత్రం 6 గంటల తర్వాత జరిగిన పోలింగ్‌పై గానీ, స్లిప్పుల పంపిణీపై గానీ అక్కడున్న వివిధ రాజకీయ పార్టీల పోలింగ్ ఏజెంట్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని తెలిపింది. అదే సమయంలో ఎన్నికల పరిశీలకుల ఎలాంటి ఫిర్యాదులు చేయలేదని తెలిపింది.

AP Govt Fact-Checks 31 471-Vote Difference Claims in 2024 Chittoor Lok Sabha Elections
యలహంక ఇంటిపై కోర్టుకు జగన్ ?- షర్మిలను అడ్డుకోవాలంటూ..!
యలహంక ఇంటిపై కోర్టుకు జగన్ ?- షర్మిలను అడ్డుకోవాలంటూ..!

'ది రిపోర్టర్స్ కలెక్టివ్' కథనం ప్రకారం, ఎన్నికల సంఘం అంతర్గత నివేదికలలో (RO Reports) ఒక రోజు వ్యవధిలో పంపిన రెండు వేర్వేరు ఫార్మాట్ నివేదికలలో (లోక్‌సభ నివేదిక వర్సెస్ అసెంబ్లీ నివేదిక) 6 గంటల తర్వాత క్యూలో ఉన్న వారి సంఖ్య నమోదులో వ్యత్యాసం కనిపించిందని అంగీకరంచింది. ఇది కేవలం అధికారుల అంతర్గత నివేదికల నమోదులో (Reporting) కనిపించిన గణాంక వ్యత్యాసం మాత్రమే తప్ప, అసలు పోలైన ఓట్లలో గానీ, ఈవీఎం లెక్కల్లో గానీ (Form 17C) ఒక్క ఓటు కూడా తేడా రాలేదని, లేదా మాయంకాలేదని తెలిపింది. అంతర్గత నివేదికల నమోదులో కనిపించిన గణాంక వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని, 31,471 ఓట్లు మాయమయ్యాయని, రిగ్గింగ్ జరిగిందని ప్రచారం చేయడం ప్రజలను తప్పుదారి పట్టించడమే అని తేల్చిచెప్పేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+