టీ20లో 19 సిక్సర్లు, 181 పరుగులు: ఐపీఎల్ స్టార్ ప్లేయర్ పవర్ హిట్టింగ్: దెబ్బకు రికార్డ్ స్కోర్

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ జట్టు కెప్టెన్ ప్రియాన్ష్ ఆర్య మెరుపులు మెరిపించాడు. స్టేడియంలో పిడుగులు కురిపించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఇండోర్‌ డెయిలీ కాలేజ్ గ్రౌండ్‌లో తమిళనాడుతో జరిగిన ఎలైట్ గ్రూప్-బీ మ్యాచ్‌లో ఈ లెఫ్ట్ హ్యాండర్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడాడు. గ్రౌండ్ నలుమూలలా సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ టీ20 క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డులను తిరగరాశాడు.

ఈ మ్యాచ్‌లో ప్రియాన్ష్ ఆర్య 68 బంతుల్లోనే 181 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏకంగా 19 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. 36 బంతుల్లోనే శతకాన్ని అందుకున్న ప్రియాన్ష్.. భారత గడ్డపై నమోదైన అత్యధిక టీ20 వ్యక్తిగత స్కోరు రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలో 2013లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున క్రిస్ గేల్ సాధించిన 175 పరుగుల రికార్డును అతను అధిగమించాడు.

Opener Priyansh Arya produced a breathtaking batting display smashing 181 off just 68 balls in SMAT

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు ప్రియాన్ష్ ఆర్య. ఓపెనర్ గా సత్తా చాటుతున్నాడు. అదే ఊపునూ ఇక్కడా కనపర్చాడు. తమిళనాడు బౌలర్లను ఉతికి ఆరేశాడు. మొదటి వికెట్ త్వరగానే పడినప్పటికీ.. ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదతను. ఆరంభం నుంచే దాడి తీవ్రత పెంచాడు. అద్భుతమైన షాట్లతో అలరించాడు. అతని టైమింగ్, పవర్ హిట్టింగ్ నైపుణ్యానికి అభిమానులు నీరాజనాలు పట్టారు.

బంగారం ధరలపై తప్పిన అంచనాలు.. !!
బంగారం ధరలపై తప్పిన అంచనాలు.. !!

ఈ అద్భుత ప్రదర్శనతో ప్రియాన్ష్ ఆర్య పలు రికార్డులను అధిగమించాడు. టీ20 క్రికెట్ చరిత్రలో ఓ భారతీయ బ్యాటర్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఇదే. గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున తిలక్ వర్మ సాధించిన 151 పరుగుల రికార్డును దాటేశాడు. అంతర్జాతీయంగా దక్షిణాఫ్రికా ఆటగాడు లువాన్ ప్రిటోరియస్ తర్వాత ప్రపంచంలోనే ఇది రెండో అత్యధిక టీ20 స్కోర్ ను నమోదు చేశాడు. ప్రిటోరియస్ 188 పరుగులు చేశాడీ మధ్యే.

మోదీ మళ్లీ ప్రధాని అయితే.. దేశంలో ఇక ఎన్నికలు అనేవి జరక్కపోవచ్చు
మోదీ మళ్లీ ప్రధాని అయితే.. దేశంలో ఇక ఎన్నికలు అనేవి జరక్కపోవచ్చు

ఒక టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్రపంచ రికార్డును కూడా ప్రియాన్ష్ ఆర్య సమం చేశాడు. న్యూజిలాండ్ ప్లేయర్ ఫిన్ అలెన్ బాదిన 19 సిక్సర్ల రికార్డు సరసన అతను నిలిచాడు. ఒక టీ20 మ్యాచ్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు టీమిండియా ప్లేయర్లల్లో టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. పంజాబ్ కింగ్స్ తరఫున అతను సాధించిన 132 పరుగుల రికార్డును దాటేశాడు.

అర్ధరాత్రి కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడికి షాక్ ఇచ్చిన కేంద్రం
అర్ధరాత్రి కాక్రోచ్ జనతా పార్టీ నాయకుడికి షాక్ ఇచ్చిన కేంద్రం

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ యష్ ధుల్ 8 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన నితీష్ రాణాతో కలిసి ప్రియాన్ష్ రెండో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 275 పరుగుల రికార్డు స్కోరు సాధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+