తమిళనాడు మీదుగా శబరిమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక

శబరిమల అయ్యప్ప మండల- మకరవిళక్కు యాత్రా కాలం ప్రారంభమైంది. మంగళవారం వేకువజామున 3 గంటలకు ప్రత్యేక పూజలతో ఆలయం తలుపులను తెరిచారు. సాధారణ భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తోన్నారు. డిసెంబర్ 27వ తేదీ వరకు మండలం- ఆ తర్వాత 30వ తేదీ నుంచి జనవరి 19వ తేదీ వరకు మకరవిళక్కు సీజన్ కొనసాగనుంది. ఈ యాత్రా కాలం ఆరంభం కావడంతో కేరళ పతనంతిట్ట కొండల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

అయ్యప్పస్వామి దర్శనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది శబరిమలకు తరలివెళ్తుంటారు. వీరిలో ఎక్కువమంది తమిళనాడు సరిహద్దుల మీదుగానే కేరళలో ప్రవేశిస్తుంటారు. తమిళనాడు వైపు నుంచి కేరళలోకి ప్రవేశించే అయ్యప్ప భక్తుల కోసం కీలక నిర్ణయాలను తీసుకున్నారు.. అధికారులు. తమిళనాడు- కేరళ సరిహద్దుల్లో ఉండే కంభమెట్టు పాయింట్ ను ఏకైక ప్రవేశ మార్గంగా నిర్ణయించారు. ఈ చెక్ పాయింట్ మీదుగానే తమిళనాడు నుంచి శబరిమలకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు.

Sabarimala pilgrims entering Keralam from Tamil Nadu have to take the Cumbummettu border route

సాధారణంగా శబరిమల యాత్ర సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే రోజుల్లో మాత్రమే కంభంమెట్టును ఏకైక ప్రవేశ మార్గంగా కేటాయిస్తుంటారు. ఈసారి యాత్రకాలం ప్రారంభం నుంచే దీన్ని ఏకైక ఎంట్రీ రూట్ గా మార్చాలని అధికారులు నిర్ణయించారు. కంభంమెట్టు ఇడతావళం వద్ద ఎమ్మెల్యే సేనాపతి వేణు, సబ్ కలెక్టర్ ఎస్ శ్రీజిత్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో దీనిపై చర్చించారు. ఇడుక్కి జిల్లా కలెక్టర్‌కు సిఫారసు చేశారు.

శబరిమల దర్శనం కోసం వెంట తీసుకెళ్లాల్సినవి: గైడ్ లైన్స్: ఈ 5 రైల్వే స్టేషన్లల్లో హెల్ప్‌డెస్క్
శబరిమల దర్శనం కోసం వెంట తీసుకెళ్లాల్సినవి: గైడ్ లైన్స్: ఈ 5 రైల్వే స్టేషన్లల్లో హెల్ప్‌డెస్క్

దీని ప్రకారం.. తమిళనాడు సరిహద్దు మీదుగా ప్రయాణించే అయ్యప్ప భక్తులకు ట్రాఫిక్ నుంచి భారీ ఉపశమనం లభించనట్టవుతుంది. కుమిలి- కంభం, కంభం-కంభంమెట్టు ఘాట్ రోడ్డు మార్గాల్లో ఏటా తలెత్తే ట్రాఫిక్ చిక్కులకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందీ నిర్ణయం వల్ల. ఈ నిబంధనను అమలు చేయడానికి ఇడుక్కి జిల్లా కలెక్టర్, తమిళనాడులోని తేని జిల్లా కలెక్టర్‌తో సమావేశం కానున్నారు. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.

శబరిమల ఆలయంలో వారికి ప్రవేశం లేదు: తేల్చి చెప్పిన కేరళ ప్రభుత్వం, టీడీబీ
శబరిమల ఆలయంలో వారికి ప్రవేశం లేదు: తేల్చి చెప్పిన కేరళ ప్రభుత్వం, టీడీబీ

తమిళనాడు సరిహద్దు దాటి కేరళలోకి అడుగుపెట్టే అయ్యప్ప భక్తులకు ఇడుక్కి జిల్లా పరిధిలోని కంభంమెట్టు మొట్టమొదటి రెస్ట్ పాయింట్ అవుతుంది. ఇక్కడి ఇడతావళంలో ఈ పాయింట్ అందుబాటులో ఉంటుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఇక్కడ అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. స్థానిక కమ్యూనిటీ హాల్‌ను యాత్రికుల వసతి కోసం ఇప్పటికే సిద్ధం చేశారు. ఇక్కడే భక్తులు వంట చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ప్రత్యేక సదుపాయాలను జిల్లా యంత్రాంగం అందుబాటులోకి తెచ్చింది.

మండల యాత్రా సమయంలో భక్తుల సంఖ్య అనుకున్నదానికంటే మరింత పెరిగితే.. సమీపంలోని ఇతర ప్రభుత్వ భవనాలను కూడా తాత్కాలిక విడిది కేంద్రాలుగా వినియోగించుకోవాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇడుక్కి జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల శబరిమల యాత్రికులకు ప్రయాణ సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఘాట్ రోడ్డు ప్రయాణం మరింత సురక్షితంగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+