మళ్లీ ఎన్డీఏ గూటికి మాజీ మిత్రపక్షం- ఎన్నికల్లో పొత్తు, డీలిమిటేషన్ కు మద్దతు...!!
బీజేపీ నాయకత్వం కొత్త వ్యూహాలతో సిద్దం అవుతోంది. త్వరలో పలు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. అదే విధంగా మహిళా రిజర్వేషన్లు- డీలిమిటేషన్ బిల్లు ఆమోదం సైతం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. దీంతో.. పంజాబ్ లో సుదీర్ఘకాలం బీజేపీతో కలిసి పని చేసి మధ్యలో విడిపోయిన శిరోమణీ అకాలీ దళ్ తిరిగి ఇప్పుడు ఎన్డీఏ చేరుతోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ మేరకు నిర్ణయం జరిగింది. సీట్ల పంపకాల పైన ఒక ఒప్పందానికి వచ్చారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఆప్, కాంగ్రెస్ కు ధీటుగా నిలవాలంటే తిరిగి శిరోమణీ అకాలీ దళ్ తో పొత్తు అవసరమని గుర్తించింది. కొంత కాలంగా జరిగిన చర్చలు ఇప్పుడు అధికారికంగా ఫల ప్రదం అయ్యాయి. దీంతో.. తిరిగి ఎన్డీఏ గూటికి శిరోమణీ అకాలీ దళ్ చేరటం లాంఛనంగా మారింది. పంజాబ్ ఎన్నికలతో పాటుగా డీలిమిటేషన్ బిల్లుకు ఇప్పుడు అకాలీ దళ్ మద్దతు అవసరం. దీంతో.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా జరిపిన చర్చల ఫలితంగా తిరిగి పొత్తు ఖరారైంది. 1996లో బీజేపీ, అకాలీ దళ్ మధ్య పొత్తు ప్రారంభమైంది. కేంద్ర వ్యవసాయ చట్టాలకు నిరసనగా 2020 సెప్టెంబర్లో అకాలీ దళ్ ఎన్డీఏ నుంచి వైదొలిగింది. దీంతో.. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఇప్పుడు తిరిగి కలిసి పోటీ చేసేందుకు నిర్ణయించాయి. పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్, కాంగ్రెస్ ఈ సారి విజయం పైన ధీమాతో ఉన్నాయి. దీంతో.. బీజేపీ వ్యూహా త్మకంగా తిరిగి అకాలీ దళ్ తో కలవాలని నిర్ణయం తీసుకుంది.

బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్న ఎన్నికలు
గ్రామీణ ప్రాంతాలతో పాటుగా రైతుల్లో అకాలీ దళ్ బలంగా ఉంది. అదే విధంగా అర్బన్ ఓటింగ్ తో పాటుగా వ్యాపారులు.. యువత మద్దతు బీజేపీ వైపు ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో.. ఈ పొత్తు ద్వారా బలమైన పోటీకి సిద్దం అవుతున్నారు. పంజాబ్ లో 2017 లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయగా.. బీజేపీ 23, అకాలీ దళ్ 117 స్థానాలకు పోటీ చేసింది. 2024 ఎన్నికల్లో పంజాబ్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయినా.. ఓట్ల శాతం 2019లో సుమారు 9.6 శాతం నుండి 18.5 శాతానికి గణనీయంగా పెరిగింది. శిరోమణి అకాలీ దళ్ బఠిండాలో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచింది. దీంతో దాని ఓట్ల శాతం సుమారు 27.5 శాతం నుండి 13 శాతానికి పడిపో యింది. ఇక.. ఇప్పుడు ఈ రెండు పార్టీల కలయిక ద్వారా రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని భావిస్తున్నాయి. ఈ కొత్త పొత్తు ఎన్నికల్లో ఏ మేర కలిసి వస్తుందనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications
