యూపీలో సీట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు.. !!

ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల గడువు దగ్గరికొస్తోంది. వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లల్లో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ముందస్తు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ రెండింటి మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు అధికారికంగా ప్రారంభం అయ్యాయి కూడా. ఢిల్లీ వేదికగా ఇరు పార్టీల సీనియర్ నేతల మధ్య మొదటి విడత భేటీ ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను 131 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఎస్పీకి స్పష్టమైన ప్రతిపాదన అందించింది.. కాంగ్రెస్.

దాదాపు రెండు గంటల పాటు సాగిందీ సమావేశం. ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పోటీ చేయాల్సిన నియోజకవర్గాలపై ఇరు పార్టీల నేతలు చర్చించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారానికి దూరం చేయడమే తమ ఉమ్మడి ధ్యేయమని ప్రతినిధులు వెల్లడించారు. అఖిలేష్ యాదవ్‌ను తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూడటానికి ఎలాంటి అభ్యంతరం లేదని, ఆయన నాయకత్వానికే తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ సైతం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.

Congress handing over a list of 131 Assembly seats wants to contest UP election while SP offers 26

సీట్ల సర్దుబాటులో భాగంగా కాంగ్రెస్ పార్టీ తొలుత 181 స్థానాలను ఆశించినప్పటికీ.. ఆ తర్వాత ఈ సంఖ్యను తగ్గించింది. మొదటి విడత చర్చల సందర్భంగా 131 స్థానాలను కోరింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను ప్రాతిపదికగా చేసుకుని ఈ జాబితాను రూపొందించినట్లు కాంగ్రెస్ నేతలు వివరించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేసిన 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు 30కి పైగా స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యత సాధించారని గుర్తుచేశారు.

రాబోయేది మెగా ఎల్ నినో: ఇప్పటికే 10 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత: ఇక ముందూ.. !!
రాబోయేది మెగా ఎల్ నినో: ఇప్పటికే 10 డిగ్రీలు పెరిగిన ఉష్ణోగ్రత: ఇక ముందూ.. !!

గాంధీ కుటుంబానికి పట్టం కడుతూ వస్తోన్న అమేథీ, రాయ్‌బరేలీ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాలన్నింటినీ కూడా తమకే కేటాయించాలని కాంగ్రెస్ కోరింది. అదే సమయంలో 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్ వాది పార్టీ కూటమిలో ఉండి, ఆ తర్వాత విడిపోయిన రాష్ట్రీయ లోక్ దళ్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీలు గెలుచుకున్న అసెంబ్లీ స్థానాలతో పాటు, ఎస్పీకి చెందిన కొందరు ప్రస్తుత ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలను కూడా తమకు కేటాయించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది.

మోదీ మళ్లీ ప్రధాని అయితే.. దేశంలో ఇక ఎన్నికలు అనేవి జరక్కపోవచ్చు
మోదీ మళ్లీ ప్రధాని అయితే.. దేశంలో ఇక ఎన్నికలు అనేవి జరక్కపోవచ్చు

ఎస్పీ మాత్రం కాంగ్రెస్ కు 26 అసెంబ్లీ నియోజకవర్గాల జాబితాను అందించింది. ఇందులో కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాలు రామ్ పూర్ ఖాస్, ఫరేందాతో పాటు రెండో స్థానంలో నిలిచిన మధుర, ఖేరాగఢ్, జగదీష్‌పూర్, కిద్వాయ్ నగర్ ఉన్నాయి. బాఘ్‌పట్, మోదీనగర్, హాపూర్, జేవార్, సయానా, ఖుర్జా, ఖైర్, ఇగ్లాస్, మంథ్, ఆగ్రా నార్త్, ఫతేపూర్ సిక్రీ, బిల్ గ్రామ్- మల్లన్‌వాన్, గోవింద్ నగర్, నాన్‌పారా, గోరఖ్‌పూర్ సిటీ, ఖజానీ, ఫద్రౌనా, ఫజిల్‌నగర్, పిండ్రా, వారణాసి కంటోన్మెంట్ ఉన్నాయి.

భారీ భూకంపం- వణికిన భారత్ సరిహద్దు ప్రాంతం
భారీ భూకంపం- వణికిన భారత్ సరిహద్దు ప్రాంతం

ఈ చర్చల ప్రతిపాదనలు ఇంకా కొనసాగాల్సి ఉందని, కాంగ్రెస్ తమకు అందజేసిన నియోజకవర్గాల జాబితాను అఖిలేష్ యాదవ్ ముందు ఉంచి విస్తృతంగా చర్చిస్తామని సమాజ్ వాది పార్టీ ఎంపీ, సీట్ల పంపకాల చర్చల ప్రతినిధి రామ్ గోపాల్ యాదవ్ తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్‌లోని మొత్తం 80 స్థానాలకు గాను ఎస్పీ 37, కాంగ్రెస్ 6 స్థానాలను గెలుచుకుని అధికార బీజేపీని 33 సీట్లకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 62 సీట్లు సాధించిన బీజేపీ బలాన్ని ఈ కూటమి గణనీయంగా తగ్గించింది. అదే విజయ పరంపరను 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని భావిస్తున్నాయి ఈ ఇరు పార్టీలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+