ఇది నా అడ్డా... CHIRA'N'JEEVI - 'మెగావర్స్' టీజర్ వచ్చేసింది..!!
మెగాస్టార్ చిరంజీవి డిజిటల్ వేదికపై సరికొత్త అవతారంలో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఆయన తొలిసారిగా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రత్యేక సెలబ్రిటీ టాక్ షో 'చిరంజీవీస్ మెగావర్స్' స్ట్రీమింగ్ కు సమాయత్తం అవుతోంది. ఈ టాక్ షో మెగావర్స్ టీజర్ వచ్చేసింది. 'ఇది నా అడ్డా' అంటూ చిరు చెప్పిన డైలాగ్ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. చిరంజీవి పేరు లో 'N' మిస్ కావటం పైన ఈ ప్రోమోలో స్పష్టత ఇచ్చారు. ఇక.. ఇప్పుడు ఈ షో పైన భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.
మెగావర్స్ షో పైన కొద్ది రోజులు బజ్ నెలకొంది. అయితే, రోజులుగా 'N' మిస్ అవుతూ సోషల్ మీడియాలో పోస్టర్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ 'N' నెట్ ఫ్లిక్స్ స్టైల్లో రివీల్ చేస్తూ చిరు చేసిన స్పెషల్ వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో 'CHIRA_JEEVI'లో 'N' లెటర్ మిస్ అవ్వడం చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. 'N' ఎక్కడ అంటూ అందరూ షాక్ అవుతుంటారు.

ఫైనల్‌గా నెట్ ఫ్లిక్స్ స్టైల్లో 'N' లెటర్ రివీల్ చేస్తూ... మెగాస్టార్ 'ఇది నా అడ్డా' అంటూ డైలాగ్ చెప్పడం ద్వారా చిరంజీవి ఈ సస్పెన్స్ కు క్లారిటీ ఇచ్చారు. మెగా నోస్టాల్జియా, మెగా నవ్వులు, మెగా ముచ్చట్లు అన్నీ ఒకే చోట. నెట్ ఫ్లిక్స్ యూనివర్స్‌లోకి మెగాస్టార్ చిరంజీవి..అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. ఈ సందర్భంగా షో లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు.
ఈ నెల 30న హైదరాబాద్‌లో సాయంత్రం 4:30 గంటల నుంచీ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించే కసరత్తు జరుగుతోంది. ఈ వేడుకలో సెలబ్రిటీలతో పాటు మెగా ఫ్యాన్స్ పాల్గొననున్నట్లు తెలు ది. త్వరలోనే 'నెట్ ఫ్లిక్స్' వేదికగా టాక్ షో స్ట్రీమింగ్ కానుంది. సినీ దిగ్గజాలు కమల్ హాసన్, అక్కినేని నాగార్జునలతో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ మహారాజా రవితేజ, నేచురల్ స్టార్ నాని, ప్రముఖ దర్శకులు సందీప్ రెడ్డి వంగా, బాబీ కొల్లి, అలాగే హాస్యనటులు బ్రహ్మానందం, సునీల్, సత్య తదితరులు ఈ షోలో సందడి చేయనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.














Click it and Unblock the Notifications
