భారత టెక్కీలకు ఊరటనిచ్చిన గూగుల్

భారత్‌లోని గూగుల్ క్లౌడ్ విభాగంలో భారీ స్థాయిలో ఉద్యోగాల కోత విధించినట్లు వస్తున్న వార్తలకు తెరపడింది. దేశంలో మాస్ లేఆఫ్స్ ఉండబోవని గూగుల్ తెలిపింది. ఇప్పటివరకు 30 మంది ఉద్యోగులను మాత్రమే తొలగించినట్లు స్పష్టం చేసింది.పునర్వ్యవస్థీకరణ, ప్రాజెక్టుల ప్రాధాన్యతల మార్పులో భాగంగానే ఈ 30 మందిని కూడా తొలగించినట్లు వివరించింది. గూగుల్ ఇండియాలో విస్తృత స్థాయిలో లేఆఫ్స్ జరుగుతున్నాయంటూ వస్తోన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.

గత కొన్ని రోజులుగా బ్లైండ్ వంటి వర్క్‌ప్లేస్ ఫోరమ్‌, ఎక్స్ వేదికగా గూగుల్ ఇండియా లో పెద్ద ఎత్తున తొలగింపులు జరుగుతున్నాయని ప్రచారం సాగింది. బెంగళూరులో పనిచేస్తోన్న ఉద్యోగులకు అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చారని, టెక్కీ పనితీరుతో సంబంధం లేకుండా సంస్థ యాజమాన్యం ఈ చర్యలు తీసుకుంటోందని కొందరు ఉద్యోగులు ఆరోపించారు. ఈ అంశంపై నెటిజన్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఆన్‌లైన్‌లో ప్రశ్నలు గుప్పించారు.

Google Cloud Hits Back on Massive Layoff in India Rumors After Confirming 30 Role Reductions Only

టెక్కీల అంతర్గత బదిలీల విషయంలో గూగుల్ యాజమాన్యం అత్యంత కఠిన నిబంధనలను అమలు చేస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల్లో వీఆర్ఎస్ గానీ, ఉద్యోగాల కోత గానీ పెద్ద స్థాయిలో ఉండవచ్చని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. గూగుల్ లో ఉద్యోగ భద్రత అనేది ఉండట్లేదని పేర్కొన్నారు. అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి ఇంటికి పంపుతోందనే ప్రచారం సైతం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై జరిగింది.

జనవరి 1 నుంచి నిరుద్యోగ భృతి అమలు
జనవరి 1 నుంచి నిరుద్యోగ భృతి అమలు

వీటన్నింటిపైనా గూగుల్ ఇండియా స్పందించింది. మాస్ లేఆఫ్స్ వార్తలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. గత వారం రోజుల్లో తమ సంస్థలోని కొన్ని ప్రాజెక్టుల ప్రాధాన్యతలను మార్చుకునే క్రమంలోనే 30 మందిని మాత్రమే తొలగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది. ఏ నిర్దుష్ట విభాగం, ఏ ప్రాంతంలోని ఉద్యోగులను తొలగించిందనే వివరాలను గానీ, వారికి అందించే పరిహార ప్యాకేజీ అంశాలను గానీ గూగుల్ ఇండియా బహిరంగంగా వెల్లడించలేదు.

యూపీలో సీట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు.. !!
యూపీలో సీట్ల పంచాయితీ ఇప్పట్లో తెగేలా లేదు.. !!

లేఆఫ్ తో పాటు, భవిష్యత్తులో దిగ్గజ టెక్ కంపెనీలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లను నిలిపివేయనున్నాయనే ప్రచారం కూడా జోరుగా సాగింది. ఐఐటీల్లో నిర్వహించ తలపెట్టిన రిక్రూట్‌మెంట్ల నుంచి ఆయా కంపెనీలు తప్పుకొన్నాయని, నూతన నియామకాలను గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు పక్కన పెడతాయనే ఊహాగానాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అవన్నీ కూడా ఊహాగానాలేనని గూగుల్ తేల్చి చెప్పింది. ముందుగా నిర్ణయించుకున్న విధంగానే క్యాంపస్ నియామకాలు ఉంటాయని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+