అమెరికాలో ట్రయల్స్.. హైదరాబాద్ లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలు.. బీ అలెర్ట్!

తక్కువ సమయంలో సులభంగా బరువు తగ్గాలన్న వారి ఆశలను ఆసరాగా చేసుకుని హైదరాబాద్ కేంద్రంగా కొందరు కేటుగాళ్లు ప్రమాదకరమైన దందాకు తెరలేపారు. అమెరికాలో ఇంకా ప్రయోగాత్మక పరీక్షల దశలో ఉన్న వెయిట్‌లాస్‌ ఇంజెక్షన్లను ఆన్‌లైన్‌ వేదికగా అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టును తెలంగాణ స్టేట్‌ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో అధికారులు రట్టు చేశారు.

ఈ వ్యవహారంలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన వ్యక్తి ప్రధాన సూత్రధారిగా గుర్తించిన హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్‌ మీడియా, వాట్సాప్‌ గ్రూపులు, ప్రత్యేక వెబ్‌సైట్ల ద్వారా ఈ అక్రమ విక్రయాలు సాగుతున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఈ ఇంజెక్షన్ సీసాలపై కేవలం పరిశోధనల కోసం మాత్రమే వినియోగించాలని స్పష్టంగా రాసి ఉన్నప్పటికీ, రీసెర్చ్ పెప్టైడ్‌ పేరుతో సామాన్య ప్రజలకు నేరుగా అమ్ముతున్నారు.

Illegal weight loss injections Illegal Sale of Unapproved US Trial Weight-Loss Injections Busted in Hyderabad

ఒక్కో ఇంజెక్షన్‌ను రూ. 5 వేల వరకు విక్రయిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా ఇంజెక్షన్లతో పాటు 12 పేజీల సమాచార పత్రాలను కూడా పంపిస్తూ నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు.దర్యాప్తులో భాగంగా కాన్పూర్‌లోని మురళీధామ్ ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా పలు నగరాలకు ఈ ఇంజెక్షన్లు సరఫరా అవుతున్నట్లు ఆధారాలు లభించాయి.

ఇప్పటికే సంతోష్‌రెడ్డి అనే వ్యక్తికి రూ. 6 వేల విలువైన ఇంజెక్షన్లు, మరో వ్యక్తికి రూ. 23 వేల విలువైన సరుకును కొరియర్‌ ద్వారా పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దందా వెనుక ఉన్న పంపిణీదారులతో పాటు చట్టవిరుద్ధంగా వీటిని కొనుగోలు చేసిన వారిపైనా అధికారులు నిఘా పెట్టారు.క్లినికల్ ట్రయల్స్ పూర్తికాని, భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లేని ఇంజెక్షన్లను వాడటం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కేంద్రమంత్రి షాకింగ్ వ్యాఖ్యలతో డైలమాలో హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2!
కేంద్రమంత్రి షాకింగ్ వ్యాఖ్యలతో డైలమాలో హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌-2!

ఇలాంటి అనధికారిక మందుల వల్ల జీర్ణకోశ వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత, గుండె, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందువల్ల బరువు తగ్గేందుకు ఆన్‌లైన్‌ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని, అర్హత కలిగిన వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చికిత్స తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+