ఎన్నికల కమిషనర్, పోలీసు అధికారులకు వైసీపీ లీగల్ నోటీసులు..!!

స్థానిక ఎన్నికల పరిణామాలను వైసీపీ సీరియస్ గా తీసుకుంది. మున్సిపల్ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఘటనల పైన సుప్రీంను ఆశ్రయించిన వైసీపీ.. ఇప్పుడు ఎస్ఈసీ సహా డీజీపీతో పాటుగా పలువురు పోలీసు అధికారులకు లీగల్ నోటీసులు జారీ చేసింది. అందులో సుప్రీం జారీ చేసిన ఆదేశాలను ప్రస్తావించింది. ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించింది. కోర్టు చెప్పిన విధంగా నడుచుకోకుంటే బాధ్యులైన అధికారులపై వ్యక్తిగత హోదాలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని హెచ్చరించింది.

రాష్ట్రంలో జరుగుతన్న స్థానిక ఎన్నికల నిర్వహణలో సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, పోలీసు ఉన్నతాధికారులతో పాటుగా రిటర్నింగ్ అధికారులకు వైసీపీ లీగల్ నోటీసులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల సమయంలో తాము దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా అక్టోబర్ 27, 2026న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నామినేషన్ల స్వీకరణ నుండి ఓట్ల లెక్కింపు ముగిసే వరకు మొత్తం ఎన్నికల ప్రక్రియను సీసీటీవీ కెమెరాలు ..డియోగ్రఫీ ద్వారా రికార్డ్ చేయాలని వైసీపీ గుర్తు చేసింది. ఫుటేజీ భద్రపరిచే చర్యలతో పాటుగా నామినేషన్ కేంద్రాలు, రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలు, పోలింగ్ కేంద్రా లు స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కవరేజీ ఏర్పాటు చేయాలని, ఎన్నికల పిటిషన్ దాఖలు గడువు ముగిసే వరకుఆ ఫుటేజీని భద్రపరచాలని పేర్కొంది.

TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
TTD: వైకుంఠ ద్వార దర్శనాలకు రిజిస్ట్రేషన్ ఇలా, ఈ తేదీల్లో టోకెన్లు- వీరికి నేరుగా అనుమతి..!!
ysrcp-sends-legal-notices-to-election-commission-dgp-over-alleged-negligence-in-implementing-suprem

వైసీపీ తాజా నోటీసులతో

కాగా, పల్నాడు, వైఎస్సార్ కడప, తిరుపతి, శ్రీకాకుళం, అనంతపురం తదితర జిల్లాల్లో తమ పార్టీ అభ్యర్థులపై దాడులు జరిగాయని, అక్రమ నిర్బంధాలకు గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంతో పాటు, ఉపసంహరించుకునేలా బలవంతం చేశారని వైసీపీ ఆరోపించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమైనా, సీసీటీవీ ఫుటేజీని తొలగించినా లేదా భద్రపరచక పోయినా రాజ్యాంగంలోని ఆర్టికల్ 129 ప్రకారం కోర్టు ధిక్కారంగా పరిగణించబడుతుందని స్పష్టం చేసింది. బాధ్యులైన అధికారులపై వ్యక్తిగత హోదాలో సుప్రీంకోర్టును వైసీపీ ఈ నోటీసుల్లో స్పష్టం చేసింది. కాగా, ఈ నెల 26న రెండో విడత మున్సిపల్.. తొలి విడత పంచాయితీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. సుప్రీం న్యాయవాది ద్వారా వైసీపీ ఈ నోటీసులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+