ఇంకా ఒక్కరోజు ఆగితే మహిళలకు సంబరం.. ఇందిరమ్మ చీరల పంపిణీ అక్కడనుండే!

తెలంగాణలోని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కానుక అందించేందుకు సిద్ధమైంది. ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 26న నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పంపిణీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి కింద ప్రభుత్వం రెండో విడత చీరల పంపిణీని చేపడుతుండటం విశేషం.

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మందికి, పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మందికి చీరలను అందించనున్నారు. మహిళల అభిరుచులు, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని చిలుకపచ్చ రంగులో వీటిని రూపొందించారు. ఆధునిక శైలితో పాటు సంప్రదాయ పద్ధతిలో కట్టుకునేందుకు అనువుగా ఉండేలా రెండు రకాల చీరలను సిద్ధం చేశారు. వీటిలో 6.30 మీటర్ల పొడవు గల 95 లక్షల పాలిస్టర్‌ చీరలు, 9 మీటర్ల పొడవు గల 5 లక్షల పాలీకాటన్‌ చీరలు ఉన్నాయి.

Indiramma Sarees Telangana to Distribute One Crore Sarees CM Revanth Reddy to Launch in Achampet

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నేత కార్మికుల చేత ఈ చీరలను నేయించారు. దీనివల్ల మహిళలకు గౌరవప్రదంగా చీరలు అందించడంతో పాటు, స్థానిక నేత కార్మికులకు నిరంతర పని, ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రేషన్‌ కార్డు కలిగిన కుటుంబాల్లో 18 ఏళ్లు పైబడిన మహిళలందరూ ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. గ్రామాలు, పట్టణాల్లో వార్డుల వారీగా ప్రజాప్రతినిధుల సమక్షంలో సెర్ప్‌ సిబ్బంది చీరలను అందజేస్తారు. లబ్ధిదారులు తమ ఆహార భద్రత కార్డు, ఆధార్‌ వివరాలను చూపించి చీరలు తీసుకోవచ్చు. ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకత పాటించేందుకు ప్రత్యేక మొబైల్‌ యాప్‌ ద్వారా లబ్ధిదారుల వివరాలను డిజిటల్‌గా నమోదు చేయనున్నారు.

అమెరికాలో ట్రయల్స్.. హైదరాబాద్ లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలు.. బీ అలెర్ట్!
అమెరికాలో ట్రయల్స్.. హైదరాబాద్ లో వెయిట్‌లాస్ ఇంజెక్షన్ల అక్రమ విక్రయాలు.. బీ అలెర్ట్!

మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. చేనేత రంగానికి ప్రభుత్వ ఆర్డర్ల ద్వారా చేయూతనివ్వడం వల్ల నేతన్నల కుటుంబాలకు భరోసా కలుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. జనవరి 26 నుంచి ప్రారంభమయ్యే ఈ పంపిణీ ప్రక్రియను జిల్లాల్లో దశలవారీగా పూర్తి చేసేలా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+