ఏపీలో రేపటి నుంచి మళ్లీ వర్షాలు- ఈ జిల్లాల్లో ..!

ఆంధ్రప్రదేశ్ ను మరోసారి వర్షాలు (AP Weather) పలకరించబోతున్నాయి. నైరుతి బంగాళాఖాతం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!
పవన్ మాటిచ్చారు..వెనక్కి తగ్గండి..! లోకేష్ ను కోరిన జనసేన నేత కోట వినుత..!

రేపు రాష్ట్రంలోని పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మిగతా జిల్లాల్లోను చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ద్రోణి ప్రభావంతో కురుస్తున్న ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

AP Weather Update Light to Moderate Rain Forecast in Several Districts for Four Days

చిత్తూరు లోక్ సభ ఎన్నికల్లో 31417 ఓట్ల గల్లంతు ? తేల్చేసిన ఏపీ సర్కార్.. !

అలాగే మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో చెట్ల క్రింద నిలబడరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవాళ సాయంత్రం నాటికి నెల్లూరు(జి) కొండాపురంలో 39.2మిమీ, ప్రకాశం(జి) కొత్తపట్నంలో 34.4మిమీ, నెల్లూరు(జి) కావలిలో 34.2మిమీ, ప్రకాశం (జి) మారెళ్లలో 33.5మిమీ, మార్కాపురం(జి) త్రిపురాంతకంలో 27.9మిమీ, నెల్లూరులో 27.5మిమీ, గుంటూరు (జి) ములుకుదురులో 26మిమీ, నెల్లూరు రూరల్లో 25.7మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.

ఇప్పటికే రాష్ట్రంలో గత నెల రోజుల కాలంలో మూడు తుఫాన్లు పలకరించాయి. వీటి వల్ల రైతులకు జరిగిన మేలు కంటే నష్టం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వర్షం పేరెత్తిత్తేనే రైతులు గగ్గోలు పెట్టేలా ఉన్నారు. అయితే ఈసారి కురిసే వర్షాలు మోస్తరుగా ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాబట్టి రైతులకు పెద్దగా నష్టం చేకూర్చకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. కాబట్టి రైతులు ఈసారి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+